పాతికేళ్ల నవ్వులు...
మిస్టర్ బీన్.. ఈ క్యారెక్టర్ మీకు పరిచయమే అనుకుంటాను. చాలా సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్త టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ హస్యగాడి పాత్రలో రోవన్ ఆట్కిన్ సన్ అద్భుతంగా జీవించాడు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలను, పెద్దలను ఎంతగానో ఆకట్టుకున్న బ్రిటీష్ కామెడీ సిరీస్ ‘మిస్టర్ బీన్’.
పాలు తాగే పసికందు నుంచి కాటికి కాళ్లు చాపిన పండుముసలి వాళ్లను సైతం నవ్వించగలగటం రోవన్ అట్కిన్ సన్ ప్రత్యేకత.1990లో మొదలైన ఈ సీరియల్ ఈ ఏడాదితో పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీన్ పాత్రధారి రోవాన్ ఆట్కిన్సన్, లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలో ఫొటోగ్రాఫర్లకు ఫోజిస్తూ సందడి చేశారు.