mits engineering college
-
డిప్లోమా విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేట: ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలంలో జరిగింది. నిడమనూరు మండలం మార్లగడ్డకు చెందిన స్వాతి(16) చిలుకూరు మండలంలోని మిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పండుగ సందర్భంగా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లిన ఆమె సోమవారం సాయంత్రం తండ్రితో కలిసి కాలేజీకి వచ్చింది. అనంతరం కాలేజీలోనే ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కాలేజీ సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, ఆమె కళాశాలకు వచ్చే సమయంలోనే పురుగుల మందు తీసుకుని ఉంటుందని, కుటుంబంతో ఆమె ఘర్షణ పడి ఉంటుందని భావిస్తున్నారు. -
రెస్క్యూ రోబో !
కురబలకోట: బోరు బావిలో చిన్నారులు పడిపోవడం.. ప్రాణాలు పోగొట్టుకోవడం..హృదయాన్ని కలచివేసే విదారక సంఘటనలు చూస్తూనే ఉన్నాం.. ఇలాంటి ప్రమాదాల నుంచి చిన్నారులను రక్షించడానికి చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగం చివరి సంవత్సరం విద్యార్థులు హరికృష్ణ, నరేష్, రమణప్ప, మనోహర్ రెడ్డి ‘రెస్క్యూ రోబో’ అనే పరికరాన్ని కనుగొన్నారు. బుధవారం ప్రిన్సిపాల్ యువరాజ్ విలేకరులకు ఆ పరికరం వివరాలను వెల్లడించారు. వారి సమాచారం మేరకు... ఈ పరికరం పైభాగం స్టెపర్ మోటార్ లింకుల ద్వారా అమర్చి ఉంటుంది. కింది భాగంలో 20 మెగా ఫిక్సెల్ వాటర్ ప్రూఫ్ కె మెరా ఏర్నాటు చేస్తారు. ప్రమాదం జరిగిన బోరు బావిలోకి ఈ పరికరాన్ని పంపి కెమెరా ద్వారా లోపలి పరిస్థితులను పరిశీలిస్తూ, గ్రిపర్ ద్వారా పైభాగాన ఉన్న స్టెపర్ మోటార్‌తో కిందికి పంపుతారు. ఆతర్వాత ల్యాప్‌టాప్‌కు కనెక్షన్ ఇచ్చుకుని పరిశీలిస్తూ ఈ పరికరాన్ని లోన చిన్నారి ఉన్న ప్రదేశం వరకు పంపి గ్రిప్పర్తో రక్షించవచ్చని తెలిపారు. భూకంపాల శిధిలాల్లో ఇరుక్కున్న వారిని కూడా రక్షించవచ్చని అన్నారు. -
బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
నల్గొండ: జిల్లాలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్న ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హెచ్ వోడీ వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా హెచ్‌వోడీ తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. అయినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. దాంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. గమనించిన తోటి విద్యార్థులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.