mixer Come to grinder
-
మార్కెట్లోకి బజాజ్ మిక్సర్లు
హైదరాబాద్: కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తయారీ కంపెనీ బజాజ్ ఎలక్ట్రికల్స్ కొత్తశ్రేణి మిక్సర్ గ్రైండర్లను విపణిలోకి విడుదల చేసింది. బజాజ్ స్ట్రోమిక్స్ ఎంజీ, ట్విస్టర్ డీఐఎక్స్ ఎంజీ, మేవ్రిక్ ఎంజీ, ట్విస్టర్ ఫ్రూటీ ఎంజీ, హెక్సాగ్రిడ్ ఎంజీ, డబ్ల్యూఎక్స్1 వెట్ గ్రైండర్లను ఏపీ, తెలంగాణ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకేసారి 6 ఉత్పత్తులను విడుదల చేయడం తొలిసారని.. మిక్సర్ గ్రైండర్ల మార్కెట్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 40 శాతం వరకుంటుందని కంట్రీ హెడ్ అతుల్ శర్మ తెలిపారు. అనవసర పాలసీలు అమ్మితే కఠిన చర్యలు: భారతీ ఆక్సా హైదరాబాద్: తప్పుడు కాల్స్‌తో వినియోగదారులను తప్పుదోవ పట్టించి అనవసర ఉత్పత్తులు అంటగట్టే చర్యలకు వ్యతిరేకంగా జీవిత బీమా సంస్థ భారతీ ఆక్సా లైఫ్ పలు చర్యలు తీసుకుంటోంది. దేశీయ బీమా రంగానికి ఈ తరహా కాల్స్ పెద్ద సమస్యగా మారాయని భారతీ ఆక్సాలైఫ్ ఎండీ, సీఈవో వికాస్‌సేత్ తెలిపారు. బాధ్యతగల బీమా కంపెనీగా ఈ తరహా అనైతిక చర్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, తమ విక్రయ బృందాలు కస్టమర్లకు అన్ని వివరాలు తెలియజేసి సరైన పాలసీ తీసుకునే విషయంలో అవగాహన కల్పిస్తారని చెప్పారు. 6జీబీ, 128 జీబీల్లో నోకియా 8.1 హైదరాబాద్: ఇప్పుడు నోకియా 8.1 స్మార్ట్ ఫోన్లు 6 బీజీ, 128 జీబీ ర్యామ్లల్లో కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని అన్ని ప్రముఖ మొబైల్ రిటైల్ స్టోర్లతో పాటూ అమెజాన్‌లో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ధర రూ.29,999 -
గ్యాస్ కనెక్షన్ వచ్చిందంటూ మోసం
పిఠాపురం, న్యూస్‌లైన్ : కొత్తపల్లి మండలం వాకతిప్పలో మంగళవారం సాయంత్రం ఓ కారులో వచ్చిన ముగ్గురు అగంతకులు గ్యాస్ కనెక్షన్లు వచ్చాయంటూ స్థానికులను నమ్మించి డబ్బు, బంగారంతో ఉడాయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వాకతిప్పకు చెందిన పి.దుర్గ సెల్‌కు ఫోన్ చేసి ‘మీకు గ్యాస్ కనెక్షన్ వచ్చింది.. వెంటనే డబ్బుకట్టి తీసుకుంటే బహుమతులు కూడా ఉన్నాయ’ని నమ్మబలికి కారులో ఆమె ఇంటికి వెళ్లారు. రూ.8 వేలు చెల్లిస్తే కనెక్షన్‌తో పాటు మిక్సర్ కమ్ గ్రైండర్ ఉచితంగా ఇస్తామని చెప్పడంతో ఆమె రూ.8వేలు తెచ్చి వారికిచ్చింది. ఇంకా ఎవరికైనా కనెక్షన్ కావాలంటే ఇస్తామని వారు చెప్పారు. తన అత్తగారికి గ్యాస్ కనెక్షన్ కావాలని, తన పుస్తెలతాడు తాకట్టు పెట్టి డబ్బు తెస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఎవరూ డబ్బు ఇవ్వకపోవడంతో వచ్చేసింది. ‘ఆ పుస్తెలతాడు ఇచ్చి మీ భర్తను మాతో పంపితే పిఠాపురంలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాం. గ్యాస్ కనెక్షన్, బహుమతులు ఇచ్చి పంపిస్తామ’ని నమ్మించారు. బంగారు తాడును భర్త సత్తిబాబుకు ఇచ్చి వారి కూడా పంపించింది. కొంత దూరం వెళ్లాక కారులో చోటు సరిపోవడం లేదని, ఆటోలో రావాలంటూ సత్తిబాబుకు రూ.100 ఇచ్చి దింపేశారు. తాము ముందువెళ్లి పుస్తెలతాడు తాకట్టు పెడతామని నమ్మి ంచారు. పిఠాపురం వెళ్లిన సత్తిబాబుకు అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన సత్తిబాబు లబోదిబోమంటూ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాగే నెల కిందట మూలపేటలో 10 మంది వద్ద నుంచి కొందరు రూ.60 వేలు దండుకుని ఉడాయించారని చెబుతున్నారు.