M.K. alagiri
-
కనిమొళికి అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
చెన్నై: డీఎంకే పార్టీ అధినేత ఎం కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. తీవ్ర ఒత్తిడి, అలసట కారణంగా కనిమొళి అస్వస్థతకు లోనయ్యారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సోమవారం డిశ్చార్జి చేస్తాం అని వైద్యులు తెలిపారు. ఫ్లూయిడ్ థెరపీని అందిస్తున్నామని..పరిస్థితి మెరుగైందని, కనిమొళికి విశ్రాంతి అవసరమని కావేరి ఆస్పత్రి విడుదల చేసిన బులెటిన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కనిమొళిని కరుణానిధి ఆస్పత్రిలో కలిశారు. -
స్టాలిన్ చేతిలో కీలుబొమ్మ: ఎం.కె.అళగిరి
కరుణపై నిప్పులుగక్కిన అళగిరి సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకే అధినేత కరుణానిధిపై ఆయన పెద్దకుమారుడు పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎం.కె.అళగిరి నిప్పులు చెరిగారు. డీఎంకే అధ్యక్ష స్థానంలో ఉన్న కరుణానిధి చిన్నకుమారుడు స్టాలిన్ చేతిలో కీలుబొమ్మగా మారారని, స్టాలిన్ చెప్పినట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి అళగిరిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. డీఎంకేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నెల 31న ప్రెస్మీట్ పెట్టి డీఎంకే లొసుగుల చిట్టా విప్పుతానన్నారు.