కనిమొళికి అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
చెన్నై: డీఎంకే పార్టీ అధినేత ఎం కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. తీవ్ర ఒత్తిడి, అలసట కారణంగా కనిమొళి అస్వస్థతకు లోనయ్యారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సోమవారం డిశ్చార్జి చేస్తాం అని వైద్యులు తెలిపారు.
ఫ్లూయిడ్ థెరపీని అందిస్తున్నామని..పరిస్థితి మెరుగైందని, కనిమొళికి విశ్రాంతి అవసరమని కావేరి ఆస్పత్రి విడుదల చేసిన బులెటిన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కనిమొళిని కరుణానిధి ఆస్పత్రిలో కలిశారు.