
స్టాలిన్ చేతిలో కీలుబొమ్మ: ఎం.కె.అళగిరి
కరుణపై నిప్పులుగక్కిన అళగిరి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకే అధినేత కరుణానిధిపై ఆయన పెద్దకుమారుడు పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎం.కె.అళగిరి నిప్పులు చెరిగారు. డీఎంకే అధ్యక్ష స్థానంలో ఉన్న కరుణానిధి చిన్నకుమారుడు స్టాలిన్ చేతిలో కీలుబొమ్మగా మారారని, స్టాలిన్ చెప్పినట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి అళగిరిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. డీఎంకేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నెల 31న ప్రెస్‌మీట్ పెట్టి డీఎంకే లొసుగుల చిట్టా విప్పుతానన్నారు.