డీఎంకే చీఫ్ కరుణానిధిపై ఎఫ్ఐఆర్ నమోదు
చెన్నై: జయలలితకు జైలు శిక్ష నేపథ్యంలో శనివారం అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి డీఎంకే చీఫ్ కరుణానిధి, ఆయన తనయుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌లపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీరితోపాటు పలువురికి వ్యతిరేకంగా ఐపీసీలోని అల్లర్లు, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద వీటిని నమోదు చేశారు. గోపాలపురంలోని కరుణ ఇంటి వద్ద డీఎంకే కార్యకర్తలు తమపై మారణాయుధాలతో దాడి చేశారని అన్నాడీఎంకే కార్యకర్తలు ఫిర్యాదు చేశారని రాయపేట పోలీసులు తెలిపారు. శనివారం బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుతో జయలలితను నాలుగేళ్ల శిక్ష పడింది.
ఈ తరుణంలో అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసనలకు దిగారు. డీఎంకే నాయకులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి.