MLA Bode Prasad
-
ఎమ్మెల్య్ ప్రోగ్రెస్ రిపోర్ట్ - బోడె ప్రసాద్
-
దీప్తి కేసులో పోలీసులకు చుక్కెదురు
సాక్షి, విజయవాడ : పెళ్లి పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతూ, ఎన్నారై పెళ్లి కొడుకుల నుంచి డబ్బు గుంజుకుంటున్న పల్లపూరి దీప్తి కేసులో బెజవాడ పోలీసులకు చుక్కెదురు అయింది. విచారణ పరిధితో సంబంధం లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారంటూ పటమట పోలీసుల తీరును న్యాయస్థానం గురువారం తప్పుబట్టింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితోనే.. కాగా పల్లపూరి దీప్తి అరెస్ట్ నేపథ్యంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితోనే పటమట పోలీసులు కేసు పెట్టారని దీప్తి తల్లి పూర్ణవల్లి ఆరోపించారు. సంబంధం లేని కేసును సీఐ దామోదర్‌తో ఎమ్మెల్యే కేసు నమోదు చేయించారని అన్నారు. ఎన్నారై ధరణికుమార్‌ను తన కుమార్తె డబ్బులు అడగలేదన్నారు. రెండు రోజుల పరిచయంతో లక్షా ఎనభై ఆరువేలు ఎవరైనా బ్యాంక్ అకౌంట్లో వేస్తారా? అని పూర్ణవల్లి ప్రశ్నించారు. మూడోరోజే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అంటూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు చేశారు. కాగా మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించి ఎన్నారై పెళ్లికొడుకులను మోసం చేస్తున్న పల్లపూరి దీప్తిని నిన్న (బుధవారం) విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పటమటకు చెందిన ధరణీకుమార్ మూడు నెలల క్రితం భారత్ మ్యాట్రీమోనిలో వధువు కోసం వెతకగా, దీప్తి అనే యువతి పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యవసరంగా తనకు కొంత డబ్బు అవసరం అని ధరణీకుమార్ను అడిగింది. ఆమె మాటలు నమ్మిన అతడు రెండు దఫాలుగా రూ.1.86 లక్షలు ఆమె అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బు తీసుకున్న నాటి నుంచి దీప్తి ఆచూకీ తెలియకపోవడంతో ధరణీకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా, నిందితురాలు గుంటూరు బ్రాడీపేటకు చెందిన దీప్తిగా గుర్తించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఆమెను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. -
బరిలో కో‘ఢీ’
ఏలూరు టౌన్, అమలాపురం, కంకిపాడు(పెనమలూరు): పోటీలకు పందెం కోడి కత్తులు దూస్తోంది! పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. న్యాయస్థానం ఆదేశాలు, పోలీస్ ఆంక్షలను ధిక్కరిస్తూ కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పండుగకు ఒకరోజు ముందే కోడి పందేలకు అంకురార్పణ చేశారు. భారీగా డబ్బులు చేతులు మారటంతో బరులు పందెంరా యుళ్లతో నిండిపోయాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజక వర్గంలోనూ కోడి పందేలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ బరికి సన్నద్ధం చేస్తున్నారు. -
ఎమ్మెల్యే బోడెపై కేసు ఎత్తివేత
హైకోర్టు స్టే విధించిన కేసులో ప్రభుత్వ ఉత్తర్వులు పెనమలూరు : హైకోర్టులో కేసు స్టే ఉండగా కృష్ణా జిల్లా, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై ఉన్న కేసును ఎత్తివేస్తూ టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మరో 14 మంది కొన్నేళ్ల క్రితం పెనమలూరు మండలం, కానూరులోని పాతచెక్‌పోస్టు సెంటర్లో పెట్రోల్ ధర పెంపును నిరసిస్తూ బందరు రోడ్డుపై ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో పెనమలూరు పోలీసులు 228/2004 ఎఫ్ఐఆర్ ఐపీసీ 143, 341, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విజయవాడ కోర్టులో విచారణలో ఉంది. అయితే ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లేఖ ఆధారంగా జీవో 12 జారీ చేస్తూ పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్, మరో 14 మంది పై కేసు ఎత్తివేసింది. కాగా తమపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని నిందితుల్లో ఒకరు హైకోర్టులో కేసు (7820/2011) దాఖలు చేశారు. ఈ కేసులో ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతున్నా ప్రభుత్వం కేసును ఎత్తివేసింది.