రైల్వేకోర్టుకు హాజరైన మంత్రి పల్లె, ఎమ్మెల్యేలు
గుంతకల్లు టౌన్: సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో కేసుల్లో ఉన్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ ఛీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బీకే.పార్థసారధి, హనుమంతరాయచౌదరి, వరదాపురం సూ రి గురువారం స్థానిక రైల్వే కోర్టుకు హాజరయ్యారు. వీరితోపాటు మహాలక్ష్మీశ్రీనివాస్, చంద్రదుండు ప్రకాష్, బుగ్గయ్యచౌదరి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు పీజీఎస్.బాబు, హేమాద్రి వాదించారు.