MLA Harish
-
మండుటెండలో రెండు గంటలు
సాక్షి, బెంగళూరు: శాంతినగర్ ఎమ్మెల్యే ఎన్ఏ హ్యారిస్ పుట్టిన రోజు వేడుకలు విద్యార్థులకు శాపంగా మారాయి. ఎమ్మెల్యే రాక ఆలస్యంగా కావడంతో పిల్లలు రెండు గంటలపాటు మండుటెండలో ఉండాల్సి వచ్చింది. వివరాలు.. హ్యారిస్ పుట్టినరోజు వేడుకలు గురువారం శాంతినగర్ పోలీసు హాకీ మైదానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థులందరినీ తీసుకురావాల్సిందిగా ముందురోజు అన్ని పాఠశాలల యాజమాన్యాలకు నిర్వాహకులు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులకు ఉచితంగా లంచ్ బ్యాగులు అందజేస్తామని ప్రకటించారు. వేడుకల ఆహ్వానాలను తిరస్కరించిన పాఠశాలలకు రవాణా సదుపాయాలను కల్పించి మరీ విద్యార్థులను మైదాన ప్రాంగణానికి నిర్వాహకులు చేర్చారు. అనుకున్నట్లుగానే ఉదయం 10.30కే విద్యార్థులు ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే విద్యార్థులు సమయానికి వచ్చినా ఎమ్మెల్యే మాత్రం రాలేకపోయారు. దీంతో విద్యార్థులు ఆయన కోసం మండుటెండలో రెండు గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఎమ్మెల్యే 12.30 గంటలకు తీరిగ్గా వచ్చినా వేడుకులను ముగించుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత విద్యార్థులకు ఉచిత లంచ్ బ్యాగులు బహూకరించి పంపించారు. మిట్టమధ్యాహ్నం ఎండలో చిన్నపిల్లలను అంతసేపు నిలబెట్టడంపై స్థానికులు, టీచర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
హరికృష్ణ బహిరంగలేఖపై చర్చకు సిద్ధం: హరీష్
కరీంనగర్: టిడిపి రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ బహిరంగలేఖపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు సవాల్ విసిరారు. హరికృష్ణ బహిరంగ లేఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని హరికృష్ణ అంటున్నారు. బావ చంద్రబాబు పంచన చేరి చెప్పులు వేసినప్పడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికార నివాసంలో సమావేశమై సమైక్యవాదం వినిపించడం కేంద్రం నిర్ణయాన్ని ధిక్కరించడమేనని పేర్కొన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు, సీమాంధ్ర నేతల దీక్షలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు చట్టాలున్నాయా? డీజీపీ సమాధానం చెప్పాలని హరీష్ రావు అన్నారు. జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి అని కొప్పుల ఈశ్వర్ అన్నారు. సమైక్యవాదానికి అనుకూలంగా దీక్ష చేస్తున్న ధూళిపాళ్లపై అనర్హత వేటు వేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఎవరి అనుమతితో దీక్ష చేస్తున్నారో స్పష్టం చేయాలన్నారు.