హరికృష్ణ బహిరంగలేఖపై చర్చకు సిద్ధం: హరీష్ | Ready to debate on Harikrsna letter: MLA Harish | Sakshi
Sakshi News home page

హరికృష్ణ బహిరంగలేఖపై చర్చకు సిద్ధం: హరీష్

Published Mon, Aug 19 2013 4:40 PM | Last Updated on Wed, Aug 29 2018 1:13 PM

Ready to debate on Harikrsna letter: MLA Harish

కరీంనగర్‌: టిడిపి రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ బహిరంగలేఖపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సవాల్ విసిరారు.  హరికృష్ణ బహిరంగ లేఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని హరికృష్ణ అంటున్నారు. బావ చంద్రబాబు  పంచన చేరి చెప్పులు వేసినప్పడు ఎన్‌టీఆర్ ఆత్మ క్షోభించలేదా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నారని విమర్శించారు.

 రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నాయన్నారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికార నివాసంలో సమావేశమై సమైక్యవాదం వినిపించడం కేంద్రం నిర్ణయాన్ని ధిక్కరించడమేనని పేర్కొన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు, సీమాంధ్ర నేతల దీక్షలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు చట్టాలున్నాయా? డీజీపీ సమాధానం చెప్పాలని హరీష్‌ రావు అన్నారు.

జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి అని  కొప్పుల ఈశ్వర్ అన్నారు. సమైక్యవాదానికి అనుకూలంగా దీక్ష చేస్తున్న ధూళిపాళ్లపై అనర్హత వేటు వేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఎవరి అనుమతితో దీక్ష చేస్తున్నారో స్పష్టం చేయాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement