సంస్కృతిని కాపాడుతున్న పల్లెలు
కంభం రూరల్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు అవకుండా పల్లె సీమలు కాపాడుతున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. అర్ధవీడు మండలం కాకర్ల, నాగులవరం గ్రామాల సర్పంచ్‌లు యేరువ విజయకుమారి, ఈర్ల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేసి మాట్లాడారు. మహిళలు పోటీల్లో పాల్గొనడం సంతోషించదగ్గ విషయమన్నారు. కాకర్లలో కొప్పుల దుర్గా శైలజ ప్రథమ, యేరువ సావిత్రి ద్వితీయ, ఆర్.ఎల్లమ్మ తృతీయ బహుమతులు సాధించారు. వారికి యేరువ వెంకటరెడ్డి ఐదు తులాల వెండి, నారు బాలిరెడ్డి మూడు, బాసు వెంకటేశ్వరరె డ్డి రెండు తులాల వెండి బహూకరించారు.
నాగులవరంలో గుడిసె విజయ, బొగ్గు రాజ్యలక్ష్మి, కనుమర్ల సునీతలకు సర్పంచ్ యేరువ వెంకటలక్ష్మి బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని బాసు వెంకటేశ్వరరెడ్డి ఘనంగా సన్మానించారు. అర్ధవీడు, గిద్దలూరు ఎంపీపీలు రవికుమార్‌యాదవ్, వంశీధరరెడ్డి, మండల కన్వీనర్ యేరువ రంగారెడ్డి , అర్ధవీడు ఎస్సై నాగమలేశ్వరరావు, కాకర్ల, నాగులవరం సర్పంచ్‌లు యేరువ విజయకుమారి, వీర్ల వెంకటలక్ష్మి, నారు అశోక్‌రెడ్డి, రమేష్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.