MLA Pratap Kumar Reddy
-
ఎమ్మెల్యే ప్రతాప్‌కు బాలకృష్ణ ఫోన్..
నెల్లూరు ,కావలి: పట్టణంలోని ముసునూరులో మహాలక్ష్మమ్మ ఆలయ స్థలంలో ఆలయానికి ఎదుట రెండేళ్ల క్రితం టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి గ్రామస్తులు తొలగించి పక్కనే ఉన్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ప్రతిష్టించేందుకు నిర్వహిస్తున్న పనులు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా టీడీపీ నాయకులు పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ముసునూరులో హడావుడి చేసినప్పటికీ గ్రామంలో వాస్తవ పరిస్థితులను గమనించి వివాదం చేయడం సరికాదనే అభిప్రాయానికి వచ్చారు. ఇదిలా ఉండగా నెల్లూరుకు చెందిన టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అంశానికి సంబంధించి వివాదాన్ని పెంచేందుకు చేసిన ప్రయత్నాలు ఆ పార్టీలోనే అంతర్గతంగా విమర్శలకు దారితీశాయి. కాగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వాస్తవ పరిస్థితులను సినీ హీరో బాలకృష్ణకు వాట్సాప్ ద్వారా తెలియజేయడంతో బాలకృష్ణ నేరుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి గురువారం ఫోన్ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడిన అనంతరం బాలకృష్ణ ఎమ్మెల్యే తీసుకొన్న చొరవను అభినందించినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని బాలకృష్ణ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి తెలియజేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాజమండ్రి నుంచి కొత్తగా కొనుగోలు చేసిన ఎన్టీఆర్ విగ్రహం ముసునూరుకు చేరుకోవడంతో విగ్రహాన్ని ప్రతిష్టించే పనులు జరుగుతున్నాయి. పక్కనే ఉన్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద కూడా శిథిలమైన దిమ్మెను మెరుగుపరుస్తున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లుగానే విగ్రహాన్ని ముసునూరు కూడలిలోని బస్‌షెల్టర్ వద్దనే ఏర్పాటు చేస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
మూడేళ్లయినా మొదలు కాని పనులు
ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎదుట స్థానికుల ఆవేదన బిట్రగుంట : బోగోలు మండలం కోవూరుపల్లి అంబేడ్కర్‌కాలనీలో మూడేళ్ల క్రితం మౌలిక వసతుల కల్పన కోసం అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు శిలాపలకం ఏర్పాటు చేసినా నేటికీ ఒక్క పని కూడా ప్రారంభించలేదంటూ కోవూరుపల్లి అంబేడ్కర్‌కాలనీ వాసులు ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఎదుట వాపోయారు. శుక్రవారం కోవూరుపల్లి అంబేడ్కర్‌కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు, యువత ఎమ్మెల్యేని శిలాపలకం వద్దకు తీసుకువెళ్లారు. 2014లో ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే మస్తాన్‌రావు హడావుడిగా శిలాపలకం ఏర్పాటు చేశారని, పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పి మూడేళ్లు గడిచినా ఒక్కపని కూడా ప్రారంభించలేదని అన్నారు. కాలనీలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, మురుగునీరు రోడ్లపైకి చేరుతుందని, తాగునీరు, వీధి దీపాలు లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. స్థానిక సామాజిక వనరుల భవనం కూడా శిథిలావస్థకు చేరుకుందని, కొత్త భవనం మంజూరు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. స్పందించిన ఎమ్మెల్యే తహసీల్దార్ కృష్ణారావుతో ఫోన్లో చర్చించి తాగునీటి సమస్యను వివరించారు. ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ఫ్లాన్ నిధుల రూ.94 లక్షల అంచనాతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శిలాపలకం వేశారు. పనులకు సంబంధించిన నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. -
కావలి ఎమ్మెల్యే దీక్ష భగ్నం
నెల్లూరు: కావలి ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేస్తున్న దీక్షకు శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష భగ్నంతో వైఎస్ఆర్ సీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. జిల్లాలోని సంగెం బ్యారేజ్ ను త్వరగా నిర్మించాలని ,కావలి కాల్వకు పూర్తిస్థాయి సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. -
రెండో రోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దీక్ష
కావలి: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. సంగెం బ్యారేజ్ ను త్వరగా నిర్మించాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కావలి కాల్వకు పూర్తిస్థాయి సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు.సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతుల సమస్యలు పరిష్కరించే వరకు వైఎస్ఆర్ సీపీ నేతలు పోరాటం సాగిస్తారని ఆయన అన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష
కావలి : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గురువారం దీక్ష ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంగెం బ్యారేజ్ ను త్వరగా నిర్మించాలని, కావలి కాల్వకు పూర్తిస్థాయి సాగునీటిని విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీటిని వెంటనే విడుదల చేస్తే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవని ప్రతాప్ కుమార్‌రెడ్డి చెప్పారు.