MLA sticker
-
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్
నెల్లూరు, సాక్షి: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, వాళ్ల అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు తెర మీదకు రావడం వెనుక కుట్ర దాగుందని మండిపడ్డారాయన. ‘‘ఓ కారుకు నా పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందనే నెపంతో నాపై బురద జల్లడం సరికాదు. ఇదంతా టీడీపీ వాళ్ల ప్రచారమే. వైఎస్సార్సీపీ రాష్ట్రంలో మరోసారి ప్రభంజనం సృష్టించనున్నట్టు స్పష్టంగా వారికి అర్ధమైపోయింది. ఓటమి భయంతోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నాపై పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారు. .. రేపవ్ పార్టీలో పట్టుబడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్‌తో కానీ, ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు పేరిట ఉంది. అతనెవరో కూడా నాకు తెలియదన్నారు. పైగా ఈ కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ కాపీ. నా ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించడంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా. రేవ్ పార్టీ వ్యవహారంపై బెంగుళూరు నార్కోటిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా అని మంత్రి కాకాణి మీడియాతో అన్నారు. -
మాధవరెడ్డి కారుపై MLA స్టిక్కర్‌పై స్పందించిన మల్లారెడ్డి
-
డబ్బు తరలింపు ఘటనలో మాజీమంత్రి ‘ఉత్తమ్’పై కేసు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు తరలింపు కేసులో మాజీ మంత్రి, హుజూర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు వాహన యజమాని, డ్రైవర్‌పై కూడా కేసు నమోదైంది. కోదాడ నుంచి హైదరాబాద్‌కు డబ్బు అక్రమంగా తలిస్తుండగా నల్లగొండ జిల్లా సూర్యాపేట వద్ద వాహనంలో నోట్లకట్టలు దగ్ధమైన విషయం విదితమే. విచారణ జరిపిన పోలీసులు.. వాహన యజమాని గౌతం, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డ్రైవర్‌పై సూర్యాపేట టౌన్ పోలీసులు నమోదు చేశారు. కేసు పురోగతిపై నివేదికను పోలీసులు కోర్టుకు పంపినట్లు తెలిసింది.