డబ్బు తరలింపు ఘటనలో మాజీమంత్రి ‘ఉత్తమ్’పై కేసు | Case filed on Former uttam kumar reddy | Sakshi
Sakshi News home page

డబ్బు తరలింపు ఘటనలో మాజీమంత్రి ‘ఉత్తమ్’పై కేసు

Published Fri, May 2 2014 2:50 AM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM

డబ్బు తరలింపు ఘటనలో మాజీమంత్రి ‘ఉత్తమ్’పై కేసు - Sakshi

డబ్బు తరలింపు ఘటనలో మాజీమంత్రి ‘ఉత్తమ్’పై కేసు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు తరలింపు కేసులో మాజీ మంత్రి, హుజూర్‌నగర్  కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు వాహన యజమాని, డ్రైవర్‌పై కూడా కేసు నమోదైంది. కోదాడ నుంచి హైదరాబాద్‌కు డబ్బు అక్రమంగా తలిస్తుండగా నల్లగొండ జిల్లా సూర్యాపేట వద్ద వాహనంలో నోట్లకట్టలు దగ్ధమైన విషయం విదితమే. విచారణ జరిపిన పోలీసులు.. వాహన యజమాని గౌతం, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డ్రైవర్‌పై సూర్యాపేట టౌన్ పోలీసులు నమోదు చేశారు. కేసు పురోగతిపై నివేదికను పోలీసులు కోర్టుకు పంపినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement