Mla sv mohanreddy
-
ఎమ్మెల్యే ఎస్వీ, ఫరూక్‌లకు షాక్
– వైఎస్సార్సీపీకే ఓటు వేస్తామన్న టీడీపీ కౌన్సిలర్ కొడుకు నంద్యాల : కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌లకు కౌన్సిలర్ భీమునిపల్లె వెంకటసుబ్బయ్య కుమారుడు పురుషోత్తం షాక్ ఇచ్చారు. ఆశీర్వాద యాత్రలో భాగంగా వీరిద్దరూ ఇటీవల వెంకటసుబ్బయ్య ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో కౌన్సిలర్లలో జరిగిన గొడవలో తండ్రి వెంకటసుబ్బయ్య గాయపడినా ఏ నాయకుడు తమను పరామర్శించడానికి రాలేదని, ఉప ఎన్నికల కోసం వస్తే ఎలా మద్దతు ఇస్తామని పురుషోత్తం ప్రశ్నించారు. ఆరునూరైనా వైఎస్సార్సీపీకే ఓటు వేస్తామని చెప్పడంతో ఫరూక్, ఎస్పీమోహన్‌రెడ్డి నిరాశతో వెనుదిరిగారు. -
ఉగాది వెలుగులు విరజిమ్మాలి
► మంచి వర్షాలు కురవాలని వరుణదేవున్ని ప్రార్థించాలి ► జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పిలుపు ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆకాంక్షించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయనఆడిటోరియంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు(కల్చరల్): ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆకాంక్షించారు. దుర్మిఖి నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ప్రతి ఒక్కరూ మంచి వర్షాలు కురిసేలా వరుణదేవున్ని ప్రార్థించాలని జిల్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో దుర్మిఖినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే దుర్మిఖి నామ సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులంతా పాడిపంటలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన కోరారు. అనంతరం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఉగాది పండుగ కర్నూలు జిల్లా ప్రజల గుండెల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని.. పారిశ్రామిక, వ్యాపార రంగాలలో మరింత అభివృద్ధి జరిగేలా దేవున్ని ప్రార్థించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రభుత్వ సంగీత కళాశాల అధ్యాపకుల బృందంచే నాదస్వరం, విద్యార్థులచే గణపతి ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమైంది. నంద్యాల పంచాగ గ్రంధకర్త శశిభూషణ సిద్ధాంతి పంచాగ పఠనం చేశారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనంలో కవులు డాక్టర్ ఎం.హరికిషన్, పుల్లా రామాంజనేయులు, మారుతీకుమారి, మాకం నాగరాజు, డాక్టర్ వి.వెంకటేశ్వర్లు, కె.స్వర్ణలత, గన్నమరాజు సాయిబాబ, ఎన్.నాగమణి చదివిన కవితలు ప్రేక్షకులను అలరించాయి. కళాకారులు చెక్కభజన, గురవయ్య నృత్యాలు ప్రదర్శించారు. రవీంద్ర విద్యానికేతన్ విద్యార్థులు, కేశవ మెమోరియల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. వివిధ రంగాల్లో సేవలందించిన డాక్టర్ ఎ.సంజీవరాయుడు, సాయికుమార్, కోటేష్, రామకృష్ణయ్య, వి.వి.రమణమూర్తి, విజయప్రసాద్లకు జిల్లాస్థాయి ఉగాది విశిష్ట పురస్కారాలు అందించారు. కర్నూలును అభివృద్ధి పథంలో నడిపిద్దాం ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని సునయన ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్రం కష్టాలనెదుర్కొంటోందని, అయినా కర్నూలును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు నిర్మాణం కోసం ప్రజలందరూ డిమాండ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంతకుముందు పంచాంగ పఠనం చేసిన ఇంద్రగంటి నరసింహ శర్మ, ఇంద్రగంటి శ్రీధర్ శర్మ కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. ఈ సంవత్సరం ఆదాయం కన్నా ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయన్నారు. ఈ సందర్భంగా చార్విరెడ్డి చేసిన శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యమ్రంలో వికాసభారతి అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్ జాయింట్ కలెక్టర్-2 రామస్వామి, ఆర్డీఓ గంగాధర్‌గౌడ్‌లతో పాటు అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు, ఉగాది ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోపవరం రామచంద్రన్, కళాకారులు సుధారాణి, చంద్రకంటి మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
పందుల బెడద.. పట్టించుకోరా?
అసెంబ్లీలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి సాక్షి, కర్నూలు: కర్నూలులో పందుల బెడద గురించి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కర్నూలులో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పందుల సంచారం మామూలుగా ఉండదు. అక్కడి చిన్న పిల్లలున నోట కరుకుచుకుని వెళ్లిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఓ సారి అప్పుడు పుట్టిన శిశువును పంది నోట కరుచుకుని వెళ్లడంతో గాయపడిన ఆ పసిగుడ్డు అనంతరం చనిపోయింది. మూడు సార్లు ఇలా పందులు పిల్లలను కరిచి గాయపరిచాయని, చర్యలు తీసుకోవాలని అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. అందుకే మరోసారి అసెంబ్లీలో చెప్పాల్సి వస్తోంది. కర్నూలు నగరంలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. కనిపిస్తే కాల్చి చంపాలనే ఉత్తర్వులు ఉన్నా.. అధికారులు ఆ మేర చర్యలు తీసుకోవడం లేదు. కనీసం మీరైనా చర్యలకు సిఫార్సు చేయాలని’ అన్నారు. అయితే సమస్య లేవనెత్తిన మంత్రి కామినేని శ్రీనివాస్ సరైన సమాధానం చెప్పకుండా.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయిస్తామన్నారు. హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయి.. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటిలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కోరారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో అయన మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ హాస్టళ్లు మొత్తం 18 ఉన్నాయి. వీటిలో బీసీ హాస్టళ్లు 8 ఉండగా.. అందులో ఐదు ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఎస్సీ వసతి గృహాలు 10 ఉండగా.. ఒకటి ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ హాస్టళ్లకు సరైన ప్రహరీలు లేవు. మరుగుదొడ్ల సౌకర్యం లేదు. తాగునీటి సమస్య ఉంది. ఇక ప్రభుత్వ భవనాలు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి స్థానంలో కొత్తగా భవనాలు నిర్మించాలి. విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామంటున్న ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నా.. హాస్టళ్ల దుస్థితి చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానించాల్సిన పరిస్థితి. ఇక హాస్టళ్లలో విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేస్తామంటున్నారు కానీ.. ఇప్పటికీ వారికి రేషన్ బియ్యమే వండిపెడుతున్నారు. ఇది దారుణం’ అని ఎమ్మెల్యే జయరాం ప్రశ్నించారు. ఇందుకు మంత్రి రావెల కిషోర్‌బాబు స్పందిస్తూ నిధులు విడుదల చేసి హాస్టళ్లను నిర్మిస్తామని చెప్పారు. -
'కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కొంటోంది'
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ పీపీ ఉద్యమం చేపడుతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చరించారు. నగరంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కొంటోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి నీచమైన కార్యక్రమాలకు దిగుతున్నారంటూ ఆ పార్టీ నేతలమై మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మోహన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
స్మార్ట్ సిటీ జాబితాలో కర్నూలును చేర్చండి
♦ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేల భేటీ ♦ రెండోదశ జాబితాలో చేరుస్తామన్న కేంద్ర మంత్రి సాక్షి, కర్నూలు : రాజధానిని కోల్పోయి అన్ని విధాలా నష్టపోయి.. అభివృద్ధిలో రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన కర్నూలును కేంద్ర ప్రకటించిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు జాబితాలో చేర్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కర్నూలు ఎంపీ బుట్టారేణుక, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నివాసంలో ఎంపీతోపాటు ఎమ్మెల్యేలు మంగళవారం ఆయనతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా గతంలో ప్రకటించిన విధంగానే కర్నూలును స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చాలని వారు కేంద్రమంత్రి వెంకయ్యను కోరారు. అభివృద్ధిలో వెనుకబడిన కర్నూలు నగరం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుతోనైనా అభివృద్ధికి నోచుకుంటుందని వారు వివరించారు. ► కర్నూలు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని 2013లో రూ. 659 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రతిపాదించిన మంచినీటి పథకం అప్పట్లో వివిధ కారణాలతో ఆగిపోయింది. అదే పథకాన్ని ఇప్పుడు మంజూరు చేయాలని కోరారు. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ప్రతిపాదించిన నాలుగులేన్ల రహదారితో కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని.. ట్రాఫిక్ నియంత్రణ కోసం జాతీయ రహదారిని కలుపుతూ కర్నూలులో రూ. 90 కోట్ల అంచనాలతో 18 కిలోమీటర్ల పొడవైన ఇన్నర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు నిర్మాణానికి సాయం చేయాలని కోరారు. ► ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లో, గూడూరు నగర పంచాయతీలో నీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపడంతోపాటు భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టేందుకు కృషి చేయాలని ఎంపీ కోరారు. ► ఎంపీ, ఎమ్మెల్యే వినతిపై స్పందించిన వెంకయ్యనాయుడు రెండోదశలో స్మార్ట్‌సిటీ జాబితాలో కర్నూలు పేరును చేరుస్తామని, ఇక సమ్మర్‌స్టోరేజీ, ఇన్నర్ రింగ్‌రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులు తదితర ప్రతిపాదనలను తప్పుకుండా పరిశీలిస్తామన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ కేంద్రమండలి సభ్యులు హఫీజ్‌ఖాన్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ లాలిస్వామి, బుట్టా నీలకంఠం ఉన్నారు. ఆత్మకూరు ప్రజల తాగునీటి కష్టాలు తీర్చండి ఆత్మకూరు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కోరారు. వైఎస్ఆర్ హయాంలో వెలుగోడు రిజర్వాయర్ మంచినీటి ప్రాజెక్టు పథకం పనులు పెండింగ్‌లో ఉన్నందున ప్రజలకు తాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదని వివరించారు. ఆ ఈ పనులకు సుమారు రూ. 1.60 కోట్ల వ్యయం అవుతుందని అందుకు సహకరించాలని కోరారు. కేంద్ర మంత్రి వెంకయ్య స్పందిస్తూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.