మాకు ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తరు?
ఎమ్మెల్యేను ప్రశ్నించిన చిన్నముల్కనూర్ గ్రామస్తులు
చిగురుమామిడి : ‘మాకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారంటూ’ సీఎం దత్తత గ్రామమైన చిన్న ముల్కనూర్ మహిళలు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ను ప్రశ్నించారు. గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకుని గ్రామస్తులు ఆయన రాకకోసం గంటల తరబడి ఎదురుచూశారు. రాగానే తమకు డబుల్బెడ్రూం ఇళ్లు ఎప్పుడు మంజూరుచేస్తారని మహిళలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని ఒక్కొక్కరిగా పిలుచుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఇళ్లు లేక అవస్థలు పడుతున్నామని, సీఎం హామీ మేరకు తమ ఇళ్లు కూల్చివేసుకున్నామని తెలిపారు. ఉన్న వారికే ఇళ్లు ఇచ్చారని, పేదలకు అన్యాయం చేశారని మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేయిస్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సతీష్‌కుమార్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులంతా శాంతించారు.