'హైకోర్టు తీర్పు స్పీకర్‌కు చెంపపెట్టులాంటిది'
హైదరాబాద్ : ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో శివకుమార్ మాట్లాడుతూ... హైకోర్టు తీర్పు స్పీకర్‌కు చెంపపెట్టులాంటిదని ఆయన అభివర్ణించారు. పార్టీ ఫిరాయించిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు శివకుమార్ విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువులోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని శివకుమార్ అన్నారు.