పదవికీ రాజీనామా చేయండి
పదవుల కోసం పార్టీమారే రకం ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
వైస్సార్ సీపీ నగర కోఆర్డినేటర్ రౌతు ధ్వజం
సాక్షి, రాజమహేంద్రవరం :
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు నీతి, నిజాయితీతో పాటు విలువలకు కట్టుబడి ఉంటే తన పదవికి రాజీనామా చేసి, పార్టీ మారాలని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు డిమాండ్ చేశారు. ఆంధ్రకే సరి టంగుటూరి, ఏబీ నాగేశ్వరరావు వంటి నేతలు విలువలతో కూడిన రాజకీయం చేసిన చరిత్ర రాజమహేంద్రవరం నగరానిదని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపారు. ఈ నేపథ్యంలో బుధవారం వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నేతలతో కలసి రౌతు సూర్యప్రకాశరావు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. అప్పట్లో మంత్రి పదవులకు రాజీనామా చేసిన కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి సీనియర్ నేతలున్నా, బలహీన వర్గాలకు పార్టీలో పెద్దపీట వేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో నమ్మకంతో పార్టీ ఆవిర్భవించాక తొలి ఎమ్మెల్సీ పదవిని ఆదిరెడ్డికి ఇస్తే, నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ఆయన చెప్పిన వారికే జగన్మోహన్రెడ్డి పార్టీ పదవులు ఇచ్చారని, ఏం అన్యాయం చేశారో ఆదిరెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మేయర్‌పదవి ఇచ్చిన టీడీపీని అప్పుడు, ఎమ్మెల్సీని చేసిన వైఎస్సార్ సీపీని ఇప్పుడు వదిలి, మరో పదవి కోసం తిరిగి టీడీపీలోకి వెళుతూ రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. పదవులు ఇస్తాన ంటే వెళ్లిపోతానన్నట్టుగా ఆయన తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఆదిరెడ్డి వెళ్లిపోవడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని, గ్రూపు రాజకీయాలకు ఇకపై తావుండదని పేర్కొన్నారు. ఆదిరెడ్డి రాకతో పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతాయని టీడీపీలో సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి కంగారు పడుతుండడం ఆదిరెడ్డి వ్యవహార శైలికి నిదర్శనమన్నారు. కాల్‌మనీ వ్యవహారంలాగా తన వద్ద రుణం తీసుకున్న నేతలను పార్టీ మారేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పదవుల దాహంతో పరితపిస్తున్న అప్పారావుకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. 2019లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నేతలందరినీ ఏకతాటిపై నడిపిస్తానని పేర్కొన్నారు. త్వరలోనే పార్టీ కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు. నగరపాలక సంస్థలో పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీ«దర్, కార్పొరేటర్లు బొంత శ్రీహరి, పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, పార్టీలో వివిధ విభాగాల నేతలు అడపా హరి, మూర్తి నాగేశ్వరరావు, సుంకర చిన్ని, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, గడ్డం రమణ, లంక సత్యనారాయణ, మజ్జి అప్పారావు, మూర్తి నాగేశ్వరావు, కానుబోయిన సాగర్, వాకచర్ల కృష్ణ, గారాల శ్రీను, కేబుల్ శ్రీను, తాతబ్బాయి, ముత్యాల పెదబాబు, రఘునరేష్ పాల్గొన్నారు.