ఉత్కంఠ..
ఖరారు కాని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి
సీఎం కేసీఆర్‌తో సమావేశమైన మూడు జిల్లాల నాయకులు
ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు
అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశం
ఆశావహుల్లో టెన్షన్.. టెన్షన్
హన్మకొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. నామినేషన్ గడవు సమీపిస్తున్న కొద్దీ ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో టీఆర్ఎస్ నుంచి ఇద్దరేసి అభ్యర్థులు అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వరంగల్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డితోపాటు నల్లగొండ జిల్లా నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నట్లు సంకేతాలు ఇస్తున్నా... వీరు ఎవరికి వారు లోలోపల వారి వారి గాడ్ ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో జిల్లాల నేతలతో చర్చలు జరుపుతున్నారు.
ఆదివారం వరంగల్ జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చం దూలాల్, పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్, నల్లగొం డకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్, విప్ సునీత, ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్ తో సమావేశమై అభ్యర్థిత్వంపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో అభ్యర్థిత్వంపై ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయినట్లు తెలిసిం ది. తిరిగి సోమవారం సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. సమాచారం. ఈ నెల 26వ తేదీతో నామినేషన్ల గడవు ముగుస్తుండడడం... కేసీఆర్ ఇంకా తుది నిర్ణయం ప్రకటించక పోవడంతో ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది. కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై తీవ్రంగా ప్రయత్నిస్తున్న అభ్యర్థులు నలుగురిని అందుబాటులో ఉం డాలని పార్టీ వర్గాలు సూచించినట్లు తెలిసింది.