రైతు ఆత్మహత్యలు మా ప్రభుత్వంలో కాదు
చిత్తూరు(రూరల్): రైతు ఆత్మహత్యలు టీడీపీ ప్రభుత్వంలో జరగలేదని, కాంగ్రె స్ హయంలో జరిగాయని ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ్మ నాయుడు అన్నారు. చిత్తూరు లో టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, ఇప్పుడు మన రాష్ట్రం 12వ స్థానంలో ఉందని తెలిపారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం తగదన్నారు. అలాగే పట్టిసీమ కోసం ప్రభుత్వం అల్లాడుతుంటే ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేక విధానాన్ని అవలంబిసున్నాయని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరిస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలమని చెప్పారు. పట్టిసీమపై విమర్శించడం తగ దన్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి ప్రత్యేక ప్యాకేజీ అవ సరమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత కృషి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ ఓర్వలేక విమర్శలు చేస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్, మేయర్ కఠారి అనురాధ, టీడీపీ నాయకులు దొరబాబు, కఠారి మోహన్, చంద్రప్రకాష్, దుర్గా రామకృష్ణ పాల్గొన్నారు.