కిరణ్కు అత్యంత సన్నిహితుడ్ని
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వాది అని రాష్ట్ర మంత్రి డొక్క మాణిక్య వర ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికలు, నామినేటేడ్ ఎమ్మెల్సీల అంశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలను కిరణ్ తూచా తప్పకుండా పాటించారని చెప్పారు. సీఎం కిరణ్కు తాను అత్యంత సన్నిహితుడినని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కిరణ్ ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరని తెలిపారు.
రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటుకు అనుకూల వాతావరణం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసంలో ఈ రోజు సాయంత్రం జరగనున్న భేటీకి రావాలని తనకు ఆహ్వనం అందిందని డొక్క మాణిక్యవర ప్రసాద్ వెల్లడించారు. అయితే ఆ భేటీకి హజరవుతున్నట్లు డొక్క మాణిక్య వర ప్రసాద్ చెప్పారు.