చంపుతా.. అనుమతివ్వండి
గవర్నర్కు చిత్రదుర్గ జిల్లా పంచాయతీ అధికారి లేఖ
సాక్షి, బెంగళూరు: తన పైఅధికారులు ముగ్గురిని హత్యచేయడానికి అనుమతివ్వాలని కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా పీడీ కోటే కార్యదర్శి ఎంఎన్ మోక్షకుమార్ రాష్ట్ర గవర్నర్ రుడాభాయ్వాలాకు లేఖ రాశారు. 8 నెలలు విధులకు గైర్హాజరయ్యారంటూ కుమార్ను 2015 ఫిబ్రవరి 20న సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తొలగించాలని సీఎం, గవర్నర్కు ఆయన లేఖలు రాశారు.
స్పందించిన సీఎం, గవర్నర్లు సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆదేశించారు. అయితే.. సస్పెన్షన్ను ఇప్పటికీ తొలగించలేదు. దీంతో ఒత్తిడికి గురైన ఆయన తన ను విధుల్లో చేర్చుకోకుండా కాలయాపన చేస్తున్న అదికారులు చంద్రశేఖర్, శ్రీధర్, సునీల్ అనే ముగ్గురిని హత్య చేయడానికి అనుమతించాలంటూ గవర్నర్కు లేఖ రాశారు. ఈ విషయం శనివారం బయటికొచ్చింది.