మౌస్ కూడా స్కాన్ చేస్తుంది
తిరువనంతపురం: ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసుకోడానికి స్కానర్ లేదే అని ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు.. ఇకపై మీ ఇబ్బందులను కంప్యూటర్ మౌస్ తీర్చనుంది. స్కానర్‌లా పనిచేసే కొత్తరకం మౌస్‌లు వచ్చేస్తున్నాయి. ‘మొబ్స్కాన్’గా పిలిచే ఈ మౌస్‌లు స్కాన్ చేసిన డాక్యుమెంట్లను ఎడిట్ చేసేలా అభివృద్ధిపరిచారు.
ఈ మొబ్స్కాన్ను బుధవారం తిరువనంతపురంలో అధికారికంగా ఆవిష్కరించినట్లు కంపెనీ అధికారి మైఖెల్బార్న్ తెలిపారు. ‘చూడడానికి సాధారణ కంప్యూటర్మౌస్లా ఉన్నా దీనికి అంతర్భాగంలో కెమెరా ఉంటుంది. పదాలను, టేబుల్స్‌ను, చిత్రాలను ఈ కెమెరా ఆధారంగా మొబ్స్కాన్ ఎడిట్ చేసుకుంటుంది.’అని కంపెనీ ముఖ్యఅధికారి ఏజీ. డక్యుడా వివరించారు. ఈ కొత్తరకం మౌస్ ధర సుమారు రూ. 6వేలుగా నిర్ణయించారు.