Mobile customers
-
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 వస్తోంది.. ఆ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది!
కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభావార్త. ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న శాంసంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీ ఎస్23 వేరియంట్లను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడళ్లను ఆవిష్కరించింది. అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 రాకతో గెలాక్సీ ఎస్22 ధర భారీగా తగ్గింది. ఒక ఫోన్ లాంచ్.. మరొక ఫోన్ భారీగా తగ్గింపు ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్. గతేడాది గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మోడళ్లతోపాటు ఇది లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 లాంచ్ చేసినప్పుడు దీని ధర రూ.72,999. ఇప్పుడు 'గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను విడుదల చేసిన నేపథ్యంలో గెలాక్సీ ఎస్22 స్టాండర్డ్ మోడల్ ఫోన్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.57,999. అలాగే ఇందులో 256జీబీ వేరియంట్ ధర రూ.61,999. శాంసంగ్ ఎస్22 ఫోన్ స్క్రీన్ సైజ్ 6.1 ఇంచులు. 120హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేటుతో ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ల్పేని కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌సెట్‌ను కలిగిన ఈ ఫోన్లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపీ మెయిన్ సెన్సర్, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10ఎంపీ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 10ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కూడా దాదాపు ఇవే ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. అయితే గెలాక్సీ ఎస్23లో కొత్త కలర్ ఆప్షన్లు, అధిక బ్యాటరీ సామర్థ్యం, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్సెట్ ఉన్నాయి. చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్, రూ. 5 లక్షలు దాటితే! -
జియో మైండ్‌బ్లోయింగ్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ!
టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే కస్టమర్లకు తనవైపు తిప్పుకుని దూసుకుపోతూ రిలయన్స్ జియో సంచలనంగా మారింది. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెడుతోంది జియో. ఇప్పుడు మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను విడుదల చేసింది. కొత్త ఏడాది కానుకగా తన కస్టమర్లకు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు అదనంగా కొన్ని రోజుల వ్యాలిడిటీ, ఉచిత డేటా వంటి బెనిఫిట్స్‌ని అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం! జియో యూజర్లకు.. స్పెషల్ ఆఫర్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ల కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే అవి నెలవారీ ప్లాన్ల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వార్షిక ప్లాన్లతో, కస్టమర్లు ప్రతి నెలా వారి ఫోన్ నంబర్‌ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు సంవత్సరానికి ఒకసారి రీఛార్జ్ చేసుకోవడంతో బోలెడు బెనిఫిట్స్‌ను పొందచ్చు. రూ. 2999 ధర ఉన్న ప్రస్తుత వార్షిక ప్లాన్‌లో.. రోజుకు 2.5GB రోజువారీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు. అంతేకాకుండా ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMSలు పొందుతారు. జియో కస్టమర్లు ఈ ప్లాన్‌లో జియో టీవీ (Jio TV), జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు. ఈ వార్షిక ప్లాన్‌లో అందించే 2.5 GB రోజువారీ డేటా ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వేగం 64Kbps స్పీడ్‌కి చేరకుంటుంది.. ఈ బెనిఫిట్స్‌తో పాటు మరింత ప్రయెజనాలు ఈ ప్లాన్‌లో జత చేసింది రిలయన్స్ జియో. ప్రత్యేక ఆఫర్ కింద, 23 రోజుల అదనపు వ్యాలిడిటీతో పాటు 75 జీబీ ఉచితంగా డేటా కూడా ఉంటుంది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
బీఎస్ఎన్ఎల్ ఉచిత రోమింగ్ షురూ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్.. మొబైల్ కస్టమర్ల కోసం సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇక వివిధ సర్కిళ్లలో తిరిగేటప్పుడు రోమింగ్ చార్జీలపై ఆందోళనతో తమ యూజర్లు పలు సిమ్‌కార్డులు, హ్యాండ్‌సెట్స్‌ను వెంటబెట్టుకోవాల్సిన అవసరం ఉండదని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. దీనితో యావత్ దేశమంతటా ఒకే మొబైల్ నంబరు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించే దిశగా మరో అడుగు ముందుకు వేసినట్లయిందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్లో పేర్కొన్నారు. జాతీయ టెలికం విధానం 2012 కింద క్రమంగా దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేట్ టెలికం కంపెనీల్లో ఎయిర్‌సెల్ ఇటీవలే అయిదు దక్షిణాది రాష్ట్రాల్లో ఉచిత రోమింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చింది.