'డెమొక్రసీ కాదు మొబొక్రసీ'
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించేలా కాంగ్రెస్ వ్యవరిస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఎవరినీ వేధింపులకు గురిచేయడం లేదని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై పరోక్షంగా దాడి చేస్తోందని మండిపడ్డారు.
బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మొదలైందని గుర్తు చేశారు. 'కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్నది డెమొక్రసీ కాదు మొబొక్రసీ. ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ నుంచి ముప్పు పొంచివుంది. మోదీ సర్కారు దెబ్బతీస్తున్నామని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ వారు దెబ్బతీస్తున్నది ఇండియాను' అని వెంకయ్య నాయుడు అన్నారు.