చారిత్రక మొగల్ రోడ్డు ప్రారంభం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని చారిత్రక మొఘల్ రోడ్డు ఆదివారం ప్రారంభంకానుంది. దీనిపై వన్ వే ట్రాఫిక్‌ను మాత్రమే అనుమతించనున్నారు. గత కొద్ది ఐదు నెలలుగా ఈ రోడ్డు మూసివేసి ఉంచారు. ఈ రోడ్డు కాశ్మీర్ లోయకు జమ్మూకు మధ్య అనుసంధానంగా ఉంటుంది. దీనిని ఆదివారంతోపాటు, సోమవారం, మంగళవారం కూడా తెరిచే ఉంచనున్నారు. ఈ రోడ్డును మొగలాయి చక్రవర్తులు నిర్మించారు. దీనిగుండానే అక్బర్ చక్రవర్తి 1586లో శ్రీనగర్‌పై దండెత్తి దానిని ఆక్రమించుకున్నాడని చెప్తారు.