moghulaiah
-
షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది?
మొఘల్ చక్రవర్తులు అటు యుద్ధమైదానాలు, ఇటు అంతఃపురాలపై ప్రత్యేక దృష్టి సారించేవారు. దీనితో పాటు ఆహార విభాగంలోనూ వివిధ రకాల ప్రయోగాలు చేసేవారు. బాబర్‌కు పాలనాకాలం తక్కువగా ఉండడంతో ప్రత్యేక ప్రయోగాలేవీ చేయలేకపోయాడని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే హుమాయున్ తన పాలనాకాలంలో చాలావరకూ తడబడుతూనే ఉన్నాడంటారు. అయితే అక్బర్‌కు తన పాలనలో తగినంత సమయం దొరకడంతో వివిధ రంగాలలో అనేక ప్రయోగాలు చేశాడంటారు. అక్బర్ తర్వాత జహంగీర్ కాలంలో, నూర్జహాన్ వివిధ రకాల మద్యాలను ప్రత్యేక పద్ధతిలో తయారు చేయించేవారు. వీటన్నింటిమధ్యలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తీరు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. జహంగీర్, అక్బర్‌లతో పోలిస్తే షాజహాన్ భార్యకు అత్యంత విధేయుడిగా ఉన్నాడని చెబుతారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు సుగంధ ద్రవ్యాలపై మోజు ఎందుకు పెరిగిందనే దాని వెనుక ఆసక్తికర కథనం వినిపిస్తుంటుంది. షాజహాన్ హయాంలో ఢిల్లీలో ఇన్ఫెక్షియస్ ఫ్లూ(అంటువ్యాధి) వ్యాపించింది. ఈ నేపధ్యంలో ప్రజల ఆహారంలో పెను మార్పు వచ్చింది. ఫ్లూ ప్రభావాన్ని తగ్గించేందుకు నాటి చెఫ్‌లు, రాజ వైద్యులు కలిసి ఆహారంలో పలు రకాల ప్రయోగాలు చేశారు. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, వ్యాధులతో పోరాడడంలో సహాయపడటానికి మసాలా దినుసులను వంటలలో విరివిగా ఉపయోగించసాగారు. ఫ్లూ లాంటి వ్యాధులతో పోరాటానికి సుగంధ ద్రవ్యాలను తగినంతగా ఉపయోగించాలని రాజ వైద్యుడు స్వయంగా షాజహాన్‌కు సూచించాడట. ఈ మేరకు షాజహాన్ తాను తీసుకునే ఆహారంలో ఎక్కువమోతాదులో మసాలాలు ఉండేలా ఆదేశాలు జారీచేసేవాడు. అది అతని ఆరోగ్యానికి తగినది కాకపోయినా దానినే అనుసరించేవాడట. షాజహాన్ ఎప్పుడూ యమునా నది నీరు తాగేందుకు ఇష్టపడేవాడు. మామిడిపండ్లన్నా షాజహాన్‌కు ఎంతో ఇష్టం. ప్రత్యేక తోటల నుంచి తాజా కూరగాయలు, నిమ్మ, దానిమ్మ, రేగు, పుచ్చకాయలను తెప్పించేవాడట. అంతే కాదు కొత్తిమీర, జీలకర్ర, పసుపు మొదలైనవాటిని ఎక్కువగా వినియోగించాలని షాజహాన్ తన వంటవాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవాడు. దీని వెనుక అతనికి ఆరోగ్యంపైగల శ్రద్ధనే ప్రధాన కారణమని చరిత్రకారులు చెబుతున్నారు. ఆహారంలో సుగంధ ద్రవ్యాలు ఉపయోగించకపోతే ఆరోగ్యం మెరుగ్గా ఉండదని షాజహాన్ నమ్మేవాడు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి? -
వింత మొఘల్ పాలకుడు: ‘ఇడియట్ మొఘల్ కింగ్‌గా పేరు
1712లో బహదూర్ షా (ప్రథమ) మరణం తరువాత, మొఘల్ పీఠం కోసం అతని కుమారుల మధ్య యుద్ధం జరిగింది. చివరికి జహందర్ షా విజయం సాధించి మొఘల్ సామ్రాజ్య సింహాసనంపై కూర్చున్నాడు. జహందర్ షా తన అసభ్యకర ప్రవర్తన కారణంగా అపఖ్యాతి పాలయ్యాడు. జహందర్ షా మొఘల్ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే తనకు ఎంతో ఇష్టమైన మహిళ లాల్ కున్వర్‌కు అధికార బాధ్యతలను అప్పగించాడు. అందానికి దాసోహమై.. లాల్ కున్వర్ మొఘల్ ఆస్థాన గాయకుడు ఖాసురత్ ఖాన్ కుమార్తె. లాల్ కున్వర్.. జహందర్ షాకు రెట్టింపు వయస్సు కలిగినది. ఆమె తన అందం నృత్యంతో విటులను అలరించేంది. లాల్ కున్వర్ చక్రవర్తి జహందర్ షాను తన ఆధీనంలో ఉంచుకున్నదని చరిత్రకారుడు స్మిత్ ‘ది హిందూ’లో ప్రచురితమైన ఒక కథనంలో రాశారు. జహందర్ షా అధికారంలోకి వచ్చిన వెంటనే లాల్ కున్వర్‌కు రాణి హోదాను అప్పగించాడు. అలాగే ‘ఇమ్తియాజ్ మొఘల్’ అనే బిరుదు కూడా ఇచ్చారు. జహందర్ షా అధిక సమయం లాల్ కున్వర్ కోసం వెచ్చించేవాడు. లాల్ కున్వర్ దీనిని తన ప్రయోజనాలకోసం సద్వినియోగం చేసుకున్నది. ఆమె మొదట తన కుటుంబ సభ్యులను మాన్సబ్లుగా నియమించింది. తరువాత వారు మొఘల్ సామ్రాజ్యం నుండి జాగీర్లు అందుకున్నారు. తరువాత ఆమె తన బంధువులను అన్ని కీలక పదవులలో నియమించింది. కుమారుల కళ్లను తొలగించి.. లాల్ కున్వర్ ఆధీనంలోకి వెళ్లిన జహందర్ షా క్రూరమైన, మూర్ఖపు చర్యలకు పాల్పడ్డాడు. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం జహందర్ కుమారులపై లాల్ కున్వర్‌కు ద్వేషం పెంచుకుంది. అతని ఇద్దరు కుమారుల కళ్లను తొలగించి, వారిని జైలులో పెట్టాలని జహందర్ షాను కోరింది. జహందర్ షా ఆమె చెప్పినట్టే చేశాడు. అతని క్రూరత్వానికి సంబంధించిన మరొక ఉదంతం ఎంతోప్రసిద్ధి చెందింది. ఒకసారి తన సరదా కోసం జనంతో నిండిన పడవను నీట ముంచి, వారి ఆర్తనాదాలు విని విరగబడి నవ్వాడట. ‘ఇడియట్ మొఘల్ కింగ్’ జహందర్ షా కొన్నిసార్లు పూర్తి నగ్నంగా దర్బారుకు హాజరయ్యేవాడు. మరికొన్నిసార్లు స్త్రీల దుస్తులు ధరించి దర్బారు నిర్వహించేవాడు. జహందర్ షా వికృత చేష్టల కారణంగా అతనికి ‘ఇడియట్ మొఘల్ కింగ్’ అనే పేరు వచ్చింది. అతను మొఘల్ చరిత్రలో అత్యంత తెలివితక్కువ చక్రవర్తి అనే పేరు పొందాడు. జైలులోనే దారుణ హత్య జహందర్ మొఘల్ సామ్రాజ్య సింహాసనంపై కేవలం 9 నెలలు మాత్రమే ఉండగలిగాడు. అతని మేనల్లుడు ఫరూక్సియార్ అతనికి వ్యతిరేకంగా ఒక దళాన్ని నడిపాడు. 1713 జనవరి 6న ఫరూక్సియార్తో ఓటమి ఎదురయ్యాక అతను లాల్ కున్వర్‌తో కలిసి ఢిల్లీకి పారిపోయి, అక్కడ ఆశ్రయం పొందాడు. అక్కడ జహందర్‌ను ఖైదు చేశారు. తరువాత అతను జైలులోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఇది కూడా చదవండి: ‘నాన్నా నేను బతికే ఉన్నాను’.. తలకొరివి పెట్టేంతలో తండ్రికి ‘మృతురాలి’ నుంచి ఫోన్.. -
జీవిత ఖైదీ ఆత్మహత్య
సంగారెడ్డి రూరల్: జిల్లా జైలు ఆవరణలో జీవిత ఖైదీ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి రూరల్ ఎస్సై శివలింగం కథనం ప్రకారం.. మెదక్ జిల్లా ఝరాసంగం మండలం కప్పాడుకు చెందిన మొగులయ్య (50)కు సొంత కూతురిపై అత్యాచారం చేసిన నేరంపై 2006లో జీవిత ఖైదు విధించారు. 2015 జూన్ వరకు చర్లపల్లి జైలులో ఉన్న మొగులయ్యను జులైలో కందిలోని జిల్లా జైలుకు తరలించారు. నెల క్రితం మొగులయ్య పెరోల్‌పై బయటకు వచ్చాడు. ఆదివారం తిరిగి జైలుకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం జిల్లా జైలు ఆవరణలో గల చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడు ఏసయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బాలికపై అత్యాచారం
రేగోడ్: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం ఖాదిరాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రాచకొండ రవీందర్ మంగళవారం ఆ ఘటన వివరాలు తెలిపారు. వాటి ప్రకారం.. గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అదే గ్రామానికి చెందిన మొగులయ్య సోమవారం సాయంత్రం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాదితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో మంగళవారం బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.