ప్రజల కష్టాలు తీరుస్తా..
- ‘పల్లె నిద్ర’లో వారి ఇబ్బందులు చూశా..
- రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
గణపురం : నియోజకవర్గంలో నాలుగేళ్ల కాలంలో ‘పల్లె నిద్ర’ చేసిన గ్రామాలు వందకు పైగానే ఉన్నాయి.. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ప డుతున్న ఇబ్బందులను తెలుసుకున్నాను.. తన పదవీ కాలంలో తప్పకుండా ఆయా గ్రామాల సమస్యలు పరిష్కరించి ప్రజల కష్టా లు తీరుస్తానని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని కర్కపల్లి గ్రామంలో 2011 డిసెంబర్లో పల్లె నిద్ర చేసిన మొగిలి రాజయ్య ఇంటిని ఆది వారం స్పీకర్ సందర్శించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాజయ్య కుటుం బం అనుభవిస్తున్న కటిక దారిద్య్రాన్ని ఆనాడు కళ్లారా చుశానని చెప్పారు. పరకాల నుంచి భూపాలపల్లికి పోయే ప్రతీసారి తాను నిద్రిం చిన ఇంటివైపు చూస్తానని చెప్పారు. రాజ య్య, అతని కుమారుడు ఓదెలు భూజలపై చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడారు. అన్నం పెట్టి ఆదరించిన ఆ కుటుంబం రుణాన్ని తీర్చుకుంటానని అన్నారు. ఇలాంటి కుటుంబాలలో మార్పు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నానని, ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలతో పక్కా గృహాం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
చెంచుకాలనీ వాసులకు స్పీకర్ వరాలు
రేగొండ : చెంచుల అభివృద్ధి కోసం పరితపిస్తున్న మధుసూదనాచారి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఈనెల 18న మండలంలోని చెంచుకాలనీని సందర్శించారు. ఆదివారం మరోసారి ఆ కాలనీకి చేరుకుని స్థానిక ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులకు జిల్లా కేంద్ర తెలియదని చెప్పడంతో స్పీకర్ స్పందించారు.
తీరిక సమయం చూసుకుని చెంచుకాలనీవాసులను నాలుగు వ్యాన్లలో వరంగల్ పట్టణానికి తరలించి అక్కడి చారిత్రక ప్రాంతలను వెంట ఉండి చూపిస్తానని హామీ ఇచ్చారు. కాలనీలోని విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఎలాంటి ఆపద వచ్చినా తనకు ఫోన్ చేసేలా కాలనీలో సెల్ ఫోన్ ఉంచుతామన్నారు.
స్పీకర్ ఇన్ని వరాలు కురిపించడంతో చెంచుకాలనీ వాసులు ఆనందంతో పొంగిపోయారు. స్పీకర్ వెంట కుంచాల సదావిజయ్‌కుమార్, మోడెం ఉమేష్‌గౌడ్, బలేరావు మనోహర్‌రావు, పున్నం రవి, పాడి ప్రతాఫ్‌రెడ్డి, తడక శ్రీనివాస్‌గౌడ్, ఐలు శ్రీధర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.