90 రోజులుగా నవేద్ ఇక్కడే తిష్ట
జమ్మూ: బీఎస్ఎఫ్ జవాన్లకు సజీవంగా చిక్కిన పాకిస్థాన్ ఉగ్రవాది మొహమ్మద్ నవెద్ దేశంలోకి వచ్చి 90 రోజులవుతుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. బీఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులకు దిగి అనంతరం గ్రామస్థుల సాయంతో సరిహద్దు బలగానికి దొరికిన నావెద్ను రాత్రంతా ప్రముఖ ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తుండగా కొన్ని ఆసక్తి కర విషయాలు తెలిశాయి. మొహమ్మద్ నవెద్ కు ఉగ్రవాద శిక్షణను లష్కరే ఈ తాయిబా సంస్థ ఇచ్చిందని, రంజాన్ మాసం నేపథ్యంలో అతడు 90 రోజుల కిందటే దేశంలోకి అడుగుపెట్టి కాశ్మీర్ లోయ ప్రాంతంలో తలదాచుకొని మెల్లగా తన పావులు కదిపినట్లు అధికారులు గుర్తించారు.
విచారణ అధికారుల తెలిపిన వివరాల మేరకు..
* రంజాన్ సమయంలో కాశ్మీర్ లోయ ప్రాంతంలో అడుగుపెట్టాడు
* పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ కు చెందిన నావెద్ గత నెల రోజులుగా జమ్మూకాశ్మీర్ లో తలదాచుకున్నాడు
* ఉదంపూర్‌కు మొహమ్మద్ నవెద్ సహా మరో ఉగ్రవాది ఓ ట్రక్కు ద్వారా చేరుకున్నారు.
* వారు చెప్తున్నట్లు అమృత్ సర్ యాత్రికులు టార్గెట్ కాదు.. బనిహల్ టన్నెల్‌కు దక్షిణ భాగంలో ఉన్న రహదారిపై వెళ్లే మిలటరీ కాన్వాయ్‌లే లక్ష్యం
* నేరుగా ఒకే ప్రశ్నకు ఒకే సమాధానం చెప్పకుండా వేర్వేరుగా సమాధానాలు చెప్తున్న ప్రకారం వారు భారీ వ్యూహమే రచించారు.
* దేశంలోని అత్యున్నత అధికారులు నావెద్ను గురువారం విచారించనున్నారు. జమ్మూ పోలీసులు కూడా ప్రశ్నించనున్నారు.
* జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) రంగంలోకి దిగనుంది.
* మొహమ్మద్ నవెద్ అరెస్టు విషయంలో పాకిస్థాన్ ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదు.