Mohammad Shahid
-
షాహెద్.. మనసున్న మారాజు!
అతనిది ముషీరాబాద్ ఏక్‌మినార్ మసీదు ఎదుట ఓ చిన్న కూల్ డ్రింక్స్ దుకాణం. ముషీరాబాద్ నియోజకవర్గంలో చాలా మందికి సామాజిక కార్యకర్తగా పరిచయం. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేయడం అతని వృత్తి అయితే సేవా కార్యక్రమాలు ప్రవృత్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి ఏ సాయం కావాలన్నా తనకు తోచిన రీతిలో సహకరిస్తారు. ముషీరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలోనే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లలు ఆకలితో చదువు మీద దష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ముషీరాబాద్ ఏక్‌మినార్ మసీదు వద్ద ఉండే సామాజిక కార్యకర్త మహ్మద్ షాహెద్ చిన్నారుల ఆకలిని చల్లార్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. గడచిన ఐదేళ్లుగా క్రమం తప్పకుండా పరీక్షలకు 40 రోజుల ముందు నుంచి ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు మీడియంలకు చెందిన దాదాపు వంద మంది విద్యార్థులకు రోజూ స్నాక్స్‌ను అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. అరటిపండ్లు, మిక్చర్, జ్యూస్, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్స్, గ్లూకోజ్ ప్యాకెట్స్, మ్యాంగో టెట్రా ప్యాకెట్స్ ఇలా ఒక్కో రోజు ఒక్కో రకం స్నాక్స్ అందిస్తున్నారు. రోజూ ఒక విద్యార్థికి రూ. 25 చొప్పున ఒక రోజు వంద మందికి రూ. 2,500 40 రోజుల మీద షుమారు లక్ష రూపాయల పరోక్ష సహాయాన్ని అందిస్తున్నారు. షాహెద్ సేవాభావాన్ని పోలీసు, విద్యా శాఖ అధికారులు, పలువురు రాజకీయ నాయకులు అభినందిస్తున్నారు. సహాయం చేయడంలో ఎంతో ఆనందం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఎవరైనా నా సహయం కోరితే వారికి నాకు తోచిన సహాయం చేయడం నా బాద్యతగా భావిస్తాను. నేను పెద్దగా చదువుకో పోయినా కష్ట పడి చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేయడం నేను సంతోషంగా భావిస్తాను. నాకు ఎంత ఆదాయం వస్తుందనేది ముఖ్యం కాదు. నాకున్న దాంట్లో నేను ఎంత సహయం చేస్తున్నానో అదే ముఖ్యం.– షాహెద్, సామాజిక కార్యకర్త -
కపిల్, గావస్కర్ చూసేవాళ్లు
మొహమ్మద్ షాహిద్ మరణం హాకీ ప్రపంచానికి తీరని లోటు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నా... కోలుకుంటున్నారని తెలిసి సంతోషించాం. అంతలోనే ఈ అనూహ్య వార్త. 80వ దశకంలో ఆయనకు సాటి మరెవరూ లేరు. ఆయనకున్న స్కిల్స్ ఇంకెవరికీ రాలేదు. హాకీ స్టిక్కు ఏదో అయస్కాంతం ఉన్నట్లు బంతిని కంట్రోల్ చేసేవారు. మైదానంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ బంతిని పూర్తి నియంత్రణతో తీసుకెళ్లేవారు. షాహిద్ ఆడుతున్నారంటే ప్రత్యర్థులు చాలా అప్రమత్తంగా ఉండేవారు. ప్రత్యర్థుల్లో ఏకంగా ఐదుగురు ఒక్క షాహిద్‌ని నియంత్రించడానికి ఆయన చుట్టూ ఉండేవారు. అయినా వాళ్లను తప్పించి మరీ సహచరులకు పాస్‌లు ఇచ్చేవారు. అంతటి స్కిల్ మరెవరికీ లేదు. ప్రతి మ్యాచ్‌లో షార్ట్కార్నర్ ఆయనే తీసుకునేవారు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వేగమే ఆయన ఆయుధం. మైదానంలోనే కాదు, బయట ఆయన నడుస్తుంటే పక్కనవాళ్లు పరుగెత్తాల్సి వచ్చేది. మాట కూడా అంతే స్పీడ్‌తో ఉంటుంది. 1988 సియోల్ ఒలింపిక్స్ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. నేను 1989లో భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యాక తొలిసారి హాలెండ్‌లో టోర్నీకి వెళ్లాను. వేరే మ్యాచ్ చూడటానికి వెళ్లి స్టాండ్స్‌లో కూర్చుంటే... ఓ ప్రేక్షకుడు ‘షాహిద్ ఎక్కడున్నారు’ అని అడిగారు. ఆయన రిటైర్ అయ్యారని చెప్పాను. ‘షాహిద్ లేకుండా ఎలా గెలుస్తారు’ అని ఆ ప్రేక్షకుడు అడిగాడు. ఆయన ఆడుతుంటే విదేశాల్లో కూడా అభిమానులు భారీ సంఖ్యలో వచ్చేవారు. బంతి ఆయన స్టిక్ దగ్గర ఉందంటే స్టేడియం హోరెత్తేది. ఆయనను చూడటం అదృష్టం. భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌లాంటి స్టార్ క్రికెటర్స్ కూడా షాహిద్ ఆటను చూడటానికి వచ్చేవారు. ఈ రోజుల్లో క్రీడాకారులకు సినిమా వాళ్ల నుంచి ఎంత ఫాలోయింగ్ ఉందో... ఆ రోజుల్లోనే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉండేది. ధనరాజ్ పిళ్లైని, నన్ను షాహిద్ బాగా ఇష్టపడేవారు. ఏ సందర్భంలో మేం కనిపించినా కూర్చోబెట్టుకుని చాలా విషయాలు చెప్పేవారు. ఏడేళ్ల క్రితం ఝాన్సీలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆయనతో కలిసి ఆడాను. హాకీని వదిలిన రెండున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన స్కిల్స్ అలాగే ఉన్నాయి. అయితే అంత గొప్ప స్కిల్‌ను తర్వాతి తరాలకు అందించలేకపోవడం మన దురదృష్టం. బనారస్‌లోనే ఉండిపోవడం వల్ల ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)లో లేదా ఏదైనా అకాడమీలోకి ఆయనను తీసుకుని కుర్రాళ్లకు ఆ మెళకువలు నేర్పించి ఉంటే బాగుండేది. రైల్వేలో స్పోర్ట్స్ ఆఫీసర్‌గానే ఆయన కెరీర్ ముగిసిపోయింది. ఏమైనా భారత హాకీ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ముకేశ్ కుమార్ (రచయిత భారత హాకీ మాజీ కెప్టెన్, ట్రిపుల్ ఒలింపియన్) -
షాహిద్ ‘షహీద్’
అస్తమించిన భారత హాకీ దిగ్గజం మొహమ్మద్ షాహిద్ అత్యుత్తమ ఫార్వర్డ్‌గా గుర్తింపు 1980 ఒలింపిక్ హాకీ జట్టులో సభ్యుడు భారత హాకీని ఒకప్పుడు తన వేగంతో పరుగులు పెట్టించిన దిగ్గజం జీవిత టర్ఫ్‌పై పరుగు ముగించారు. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించడంలో ప్రపంచ నీరాజనాలందుకున్న ఫార్వర్డ్ తన బతుకు డిఫెన్స్‌లో మాత్రం బలహీనంగా మారిపోయారు. ‘నిర్ణీత సమయానికి’కి ముందే వచ్చిన అనారోగ్యంతో... నాటి హాకీ సూపర్ స్టార్ షాహిద్ 56 ఏళ్లకే ‘షహీద్’గా మారారు. న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం, 1980 మాస్కో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత మొహమ్మద్ షాహిద్ అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ తర్వాత వచ్చిన జాండీస్, డెంగీ షాహిద్ పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. ఆ తర్వాత ఆయన కోలుకోలేకపోయారు. ఇక్కడి మెడిసిటీ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతూనే షాహిద్ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య పర్వీన్, కవల పిల్లలు సైఫ్, హీనా ఉన్నారు. భారత హాకీ జట్టు ఆఖరిసారిగా ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గిన 1980 జట్టులో షాహిద్ కీలక సభ్యుడు. ఆ తర్వాత మరో రెండు ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న షాహిద్, రెండు ఆసియా క్రీడల్లో భారత్ పతకాలు గెలవడంలో తనదైన పాత్ర పోషించారు. 1979నుంచి 1988 సియోల్ ఒలింపిక్స్ వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన షాహిద్‌ను భారత ప్రభుత్వం అర్జున (1981), పద్మశ్రీ (1986) అవార్డులతో సత్కరించింది. వారణాసికి చెందిన షాహిద్ చనిపోయే సమయానికి భారత రైల్వేలో స్పోర్ట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. వారణాసిలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. అత్యుత్తమ కెరీర్... 1960 ఏప్రిల్ 14న జన్మించిన షాహిద్, 1979లో ఫ్రాన్స్‌లో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో రాణించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అదే ఏడాది నాలుగు దేశాల టోర్నీ ద్వారా సీనియర్ టీమ్‌లోకి కూడా వచ్చేశాడు. మైదానంలో చిరుతలా పరుగెత్తడంతో పాటు బంతిని డ్రిబిల్ చేయడంలో అద్భుత నైపుణ్యం షాహిద్ సొంతం. 80ల్లో షాహిద్, జఫర్ ఇక్బాల్ జోడి అటాకింగ్ హాకీకి పర్యాయపదంగా నిలిచింది. 1980లో ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో ‘బెస్ట్ ఫార్వర్డ్’ అవార్డు అందుకున్న షాహిద్, ఒలింపిక్స్ స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యుడిగా తన కెరీర్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. సంతాపాల వెల్లువ భారతదేశం ఒక గొప్ప క్రీడాకారుడిని కోల్పోయింది. షాహిద్‌ను రక్షించుకునేందుకు మేం చేయాల్సిందంతా చేశాం. అయితే మా సహాయం, ప్రార్థనలు ఆయనను బతికించుకునేందుకు సరిపోలేదు -ప్రధాని నరేంద్ర మోదీషాహిద్ మృతి నన్ను కలచివేసింది. అతను చాలా మంచి మనిషి. అయితే చనిపోయాక గానీ మనవాళ్ల గొప్పతనాన్ని గుర్తించకపోవడం దురదృష్టకరం - బల్బీర్ సింగ్ సీనియర్, మాజీ ఆటగాడు మనం మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడంలో అతని డ్రిబ్లింగ్ కీలక పాత్ర పోషించింది. భారత్ ఒక్కటే కాదు ప్రపంచం మొత్తం అతని ఆటకు అచ్చెరువొందింది. చివరి రోజు కూడా తనకేమీ కాదని, డిశ్చార్జ్ అవుతానని నమ్మకంతో చెప్పాడు - ఎంకే కౌశిక్, మాజీ ఆటగాడు నా జీవితంలో అతనిలాంటి చురుకైన ఆటగాడిని చూడలేదు. మా మధ్య ఫీల్డ్‌లో ఎంతో గొప్ప సమన్వయం ఉండేది. ఆయన మరణం హాకీ ప్రపంచానికి తీరని లోటు - జఫర్ ఇక్బాల్, మాజీ ఆటగాడు -
మాజీ ఆటగాడికి అండగా హాకీ ఇండియా
న్యూఢిల్లీ: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న భారత మాజీ హాకీ ఆటగాడు మొహ్మద్ షాహిద్‌కు అండగా ఉండేందుకు హాకీ ఇండియా(ఎచ్ఐ) ముందుకొచ్చింది. ఒకవేళ అతనికి కాలేయ మార్పిడి అవసరమైతే వైద్యానికి అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాజాగా వెల్లడించింది. గత నెలలో షాహిద్ కు కామెర్లు సోకడంతో చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన కోలుకున్న తరువాత ఉదర సంబంధిత సమస్యలు తలెత్తడంతో స్థానికి ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ షాహిద్ పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని వారణాసి నుంచి ఢిల్లీలోని మెడంటా ఆస్పత్రికి తరలించారు. దానిలో భాగంగానే గత మూడు రోజుల నుంచి ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచారు. అయితే ఆ ఆటగాడికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హాకీ ఇండియా తెలిపింది. అతని వైద్యానికి అయ్యే ఖర్చులను పూర్తిగా భరిస్తామని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బత్ర స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే షాహిద్ కుటుంబంతో నిత్యం టచ్ లో అతని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అతనికి కాలేయ మార్పిడి అవసరమైన పక్షంలో ఆ ఖర్చులను కూడా భరిస్తామని నరీందర్ బత్ర తెలిపారు.1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన హాకీ జట్టులో షాహిద్ సభ్యుడు .1981లో షాహిద్‌ను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. కాగా, ఆ తరువాత 1982లో ఆసియా గేమ్స్‌లో రజతం, 1986లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టులో షాహిద్ ఆటగాడిగా ఉండటం విశేషం. -
హరీశ్‌రావత్ కార్యదర్శిపై వేటు
డెహ్రాడూన్: ‘లిక్కర్ లెసైన్సు’ల అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌రావత్ వ్యక్తిగత కార్యదర్శి మొహమ్మద్ షాహిద్‌పై వేటు పడింది. లిక్కర్ లెసైన్సుల మంజూరు కోసం లంచం ఇవ్వాలంటూ మొహమ్మద్ షాహిద్ ఓ మధ్యవర్తితో మంతనాలు చేసినట్లుగా రహస్య ఆపరేషన్ వీడియోలు బయటపడిన విషయం తెలిసిందే. సీఎం హరీశ్రావతే ఈ అవినీతి వ్యవహారాన్ని నడిపాడంటూ బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ షాహిద్‌ను బాధ్యతల నుంచి తొలగిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘లిక్కర్ లెసైన్సు’ల వ్యవహారంలో పారదర్శకంగా విచారణ జరిగేందుకు తనను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని షాహిద్ కోరారని, దాంతోపాటు సీఎం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అందులో పేర్కొంది.