‘పనికి పోం.. బడికి పోతాం..’
తమకు చదువుకోవాలని ఉన్నా.. తల్లిదండ్రులు మాత్రం పనికి పంపిచాలని ప్రయత్నిస్తుండటంతో.. ఇద్దరు చిన్నారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా వీరవల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడికి చెందిన మహమ్మద్ అక్రం, షర్మిలలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పిల్లలను అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంచి పెంచుతున్నారు. ఈక్రమంలో ఈ ఏడాది వారిని పాఠశాలకు పంపడం తమ స్థాయికి మించిన పని అని వారు పిల్లలను తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపారు. ఇంటికి వచ్చిన చిన్నారులు పాఠశాలకు వెళ్తమని తల్లిదండ్రులను బతిలాడినా.. లాభం లేకపోవడంతో.. మహమ్మద్ షన్ను(12), సిద్దీఖ్(11) తాతయ్య సాయంతో వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు.