హత్యకేసులో నలుగురికి జైలు
న్యూఢిల్లీ: ఓ వ్యక్తిని హత్యచేసిన నలుగురికి జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇనుపరాడ్స్ వినియోగించి దాడి చేయడ వలన తీవ్రంగా గాయపడిని వ్యక్తి పరిస్థితి విషమించడంలో మృతి చెందాడని రుజువైంది. అదనపు సెషన్స్ జడ్జి అశుతోష్ కుమార్ ఈ మేరకు నేరస్తులకు జైలు శిక్ష ఖరారు చేశారు. నైరుతి ఢిల్లీకి చెందిన మోహద్ నిషార్, ఇస్తకార్, రమీజ్‌లపై ఐపీసీలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. నిందితులు ఉద్దేశ పూర్వకంగా దండ, సారియ ఇనుప ఆయుధాలతో బాధితుడిపై దాడికి పాల్పడ్డారు.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల తర్వాత మృతి చెందాడు. నిందితులు కొట్టిన గాయాల కారణంగానే అతడు మృతి చెందాడు. ఎలాంటి నేరం చేయకుండానే మధ్యలోనే జీవితాన్ని చాలించాడు, దాంతో అతడిపై ఆధారపడిన కుటుంబం వీధుల పాలైందని కోర్టు అభిప్రాపడిందని జడ్జి పేర్కొన్నారు. మహ్మద్ తన్వీర్‌ను కొడుతుండగా, రక్షించబోయిన మొహద్ గుఫ్రాన్ స్వల్పగాయాలకు గురైయ్యాడు.
ఇతనితోపాటు పోలీసుల సాక్ష్యాన్ని పరిశీలించిన కోర్టు ఈ మేరకు దోషులుగా నిర్దారిస్తూ జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరు రూ. 15,000 జరిమానా విధిస్తూ ఆదే శించింది. ఆగస్టు 25, 2010లో ప్రత్యక్షసాక్షి మహ్మద్ గఫ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కపషెహరాలో పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్న తన్వీర్‌పై నలుగురు వ్యక్తులు ఇనుప రాడ్స్‌తో దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు పూర్వాపరాలు పరీలించిన కోర్టు నేరస్తులకు కఠిన కారాగార శిక్ష విధించింది.