breaking news
Mohan Srivatsa
-
అందుకే చెప్పుతో కొట్టుకున్న.. క్షమించండి: దర్శకుడు
టాలీవుడ్ సినిమా 'త్రిబాణధారి బార్బరిక్' విడుదల తర్వాత ఈ టైటిల్ బాగా వైరల్ అయింది. అందుకు ప్రధాన కారణం ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స అని చెప్పవచ్చు. సినిమా విడుదల తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. మంచి సినిమా తీసినా సరే తనకు సపోర్టుగా ఎవరూ నిలబడలేదని ఆయన బాధ పడ్డారు. చాలా కష్టపడినప్పటికీ తగిన ఫలితం దక్కలేదంటూ చెప్పుతో కొట్టుకుని అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అయితే, తాజాగా ఆయన మరో వీడియోతో క్లారిటీ ఇచ్చారు.'త్రిబాణధారి బార్బరిక్' సినిమా కోసం తన కుటుంబాన్ని కూడా బాధ పెట్టానని దర్శకుడు శ్రీవత్స చెప్పారు. ఆపై భావోద్వేగానికి గురై సినీ ప్రేక్షకులను కూడా ఇబ్బంది పెట్టానని ఆయన చింతించారు. ఈ సినిమా నచ్చకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చునని తెలిపారు. ప్రేక్షకులు ఏదైనా కొత్తగా ఆలోచించాలనే ఈ సినిమాను తెరకెక్కించాను. మలయాళ సినిమాకు దక్కిన ఆదరణ కూడా తన మూవీకి దక్కకపోయేసరికి జీర్ణించుకోలేకపోయానన్నారు. ఈ మూవీ గురించి ఎవరూ మాట్లాడకపోవడంతో అలా చెప్పుతో కొట్టుకున్నట్లు తెలిపారు. ఆ వీడియో ఎవరికైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు.సినిమా రిజల్ట్ చూసి ఉదయభాను కూడా గుక్కపెట్టి ఏడ్చేశారని శ్రీవత్స అన్నారు. దీంతో తాను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నటుడు నరేశ్ కూడా బాధ పడ్డారని గుర్తుచేసుకున్నారు. అయితే, వీడియో వైరల్ అయ్యాక ఇతర దేశాల్లో సినిమా చూసిన వారు తనకు మెసేజ్ చేశారని వాటిని పంచుకున్నారు. సినిమా బాగుందని మెచ్చుకోవడంతో కాస్త సంతోషాన్నిచ్చింది. కానీ, ఇక్కడ కనీసం సినిమా బాగుంది, బాగాలేదు అని కూడా చెప్పడం లేదన్నారు. అందుకే ఎమోషనల్ అయినట్లు ఆయన చెప్పుకొచ్చారు. సినిమా చూసి తప్పులు చెబితే మరోసారి జరగకుండా చూసుకుంటాను కదా అని కోరారు. View this post on Instagram A post shared by Moni Vathsa Mohan (@mohan_srivatsa) -
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
రీసెంట్గా 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా రిలీజైంది. పాజిటిక్ టాక్ వచ్చినా సరే దీన్ని జనాలు పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స.. తన చిత్రం చూసేందుకు ఎవరూ థియేటర్లలోకి రావట్లేదని బాధపడుతూ చెప్పుతో కొట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు గతంలో తీసిన మరో మూవీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: 120 దేశాలు.. 100 కోట్ల మంది.. కెన్యా మంత్రితో రాజమౌళి)డైరెక్టర్ మోహన్ శ్రీవత్స 'బార్బరిక్' కంటే ముందు 'కరణ్ అర్జున్' అనే సినిమా తీశాడు. 2022 జూన్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ లేకపోవడం, కంటెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో థియేటర్లలో పెద్దగా ఫెర్మార్మ్ చేయలేదు. జనాలు ఆ చిత్రం గురించి మర్చిపోయారు. అలాంటిది దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'కరణ్ అర్జున్' విషయానికొస్తే.. కరణ్ (నిఖిల్ కుమార్) తనకు కాబోయే భార్య వృషాలి(షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళ్తాడు. ఆ దారిలో అర్జున్ (అభిమన్యు) వీళ్లిద్దరినీ వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఒకానొక సమయంలో అర్జున్ ఆ ఇద్దరిని షూట్ చేసి చంపాలనుకుంటాడు. అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో అనేక పాట్లు పడతారు కరణ్, వృషాలి. వీరిద్దరిని అర్జున్ ఎందుకు వెంబడించాడు? చివరకు ఏమైందనేదే మిగతా సినిమా.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే) -
నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా.. తెలుగు దర్శకుడి ఆవేదన
తెలుగు యువ దర్శకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏకంగా చెప్పుతో కొట్టుకున్నాడు. మంచి సినిమా తీసినా సరే జనాలు ఎందుకు రావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక టాలీవుడ్లో ఉండనని అంటున్నాడు. ఇంతకీ అసలేమైంది? ఈ డైరెక్టర్‌కి వచ్చిన కష్టమేంటి?వినాయక చవితి వీకెండ్లో సుందరకాండ, అర్జున్ చక్రవర్తి, త్రిభాణదారి బార్బరిక్ లాంటి తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. మలయాళ డబ్బింగ్ మూవీ 'కొత్త లోక' కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటిలో 'కొత్త లోక' చిత్రానికి ఉన్నంతలో పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో 'త్రిభాణధారి బార్బరిక్' దర్శకుడు మోహన్ శ్రీవత్స ఆవేదనకు లోనయ్యాడు. తన బాధని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు) 'తాజాగా 'బార్బరిక్' ఆడుతున్న థియేటర్‌కి వెళ్తే లోపల పది మంది మాత్రమే ఉన్నారు. నేనెవరో చెప్పకుండా సినిమా ఎలా ఉందని అడిగితే అందరూ బాగుందని చెప్పారు. అలానే నిన్న(శనివారం) సాయంత్రం నా భార్యతో మూవీ చూసేందుకు వెళ్లాను. మనసు ఏం బాగోలేక అరగంటలోనే ఇంటికి తిరిగొచ్చేశాను. నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని భయపడి నా భార్య కూడా నాతో పాటు వచ్చేసింది. ఇంత మంచి సినిమా తీస్తే జనాలు ఎందుకు రావట్లేదు భయ్యా. నాకు అసలు ఇది అర్థం కావట్లేదు. మలయాళం నుంచి సినిమాలు వస్తే.. అక్కడ మంచి కంటెంట్ వస్తే థియేటర్లకు వెళ్తున్నారు కదా. ఇక మలయాళంలోనే సినిమాలు తీస్తా, అక్కడ హిట్ కొట్టి నిరూపించుకుంటా. సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానని అన్నాను కదా అందుకే నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను' అని డైరెక్టర్ మోహన్ శ్రీవత్స వీడియో పోస్ట్ చేశాడు. సత్యరాజ్, ఉదయభాను `త్రిభాణధారి బార్బరిక్`లో ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి బాగుందనే టాక్ వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం వల్లనో ఏమో గానీ జనాలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దర్శకుడికి ఆవేదన ఉండొచ్చు కానీ ప్రస్తుతం జనాలు.. స్టార్ హీరోల చిత్రాలైతేనే థియేటర్లలోకి వచ్చి చూస్తున్నారు. చిన్న చిత్రాలైతే ఓటీటీలో చూసుకోవచ్చులే అనే మైండ్ సెట్‌తో ఉంటున్నారు.(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు) View this post on Instagram A post shared by Moni Vathsa Mohan (@mohan_srivatsa) -
‘త్రిబాణధారి బార్బరిక్’లో కొత్తదనం ఇదే : దర్శకుడు
సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ .ఎన్ సింహా, ‘సత్యం’ రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో దర్శక–నిర్మాత మారుతి సమర్పణలో అడిదెల విజయ్‌పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇండస్ట్రీలో మనుగడ సాగించాలని సంగీతం నేర్చుకుని, ఎన్నో ఈవెంట్స్‌లో పాటలు పాడాను. ఇన్ని రోజులు నాకు సంగీతమే తిండి పెట్టింది.దర్శకుడిగా ‘త్రిబాణధారి బార్బరిక్’ నా తొలి చిత్రం. నేను కథను అద్భుతంగా నరేట్ చేయగలను. అలా మారుతిగారికి చెబితే, ఆయన ఆశ్చర్యపోయారు. ఓ పాప చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. ఆగస్టు 15 సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఇంట్రవెల్, ఆగస్టు 15 తర్వాత పది రోజులకు జరిగే మరో కథతో సెకండాఫ్ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు మైథలాజికల్ టచ్ ఇచ్చాను. ఈ సినిమాలో విలన్ అంటూ ఎవరూ ఉండరు. అన్ని పాత్రల్లోనూ అంతర్గత యుద్ధం జరుగుతుంటుంది. ఈ సినిమా కొత్తదనం అదే. బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రాన్ని ఆపగలడు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్ధం జరిగేలా చేస్తాడు. నార్త్‌లో బార్బరికుడికి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనకు హైదరాబాద్‌లోనూ నాలుగు టెంపుల్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్‌గారు బార్బరికుడిలా కొన్ని చోట్ల కనిపిస్తారు. నా తర్వాతి చిత్రం మారుతిగారి బ్యానర్లోనే ఉండొచ్చు’’ అన్నారు.