'మొహంజదారో' షూటింగ్ పూర్తి
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా మొహంజదారో. గత ఏడాది జనవరిలోనే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా షూటింగ్లో పలుమార్లు గాయపడ్డ హృతిక్ ఫైనల్‌గా మొహంజదార్ షూటింగ్‌ను పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
హృతిక్ సరసన, పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అశుతోష్ గోవరీకర్ దర్శకుడు. గతంలో హృతిక్ హీరోగా జోదా అక్బర్ సినిమాను తెరకెక్కించిన అశుతోష్, మరోసారి పీరియాడిక్ సినిమాతోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. వీలైనంత త్వరగా నిర్మాణంతర కార్యక్రమాలను పూర్తి చేసి ఆగస్టు 12న మొహంజదారో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
MOHENJO DARO! See u all on 12th AUGUST. Get ready to be transported into a world that time forgot... Love you all
— Hrithik Roshan (@iHrithik) 8 April 2016