రామోజీ సృష్టించిన మాయా ప్రపంచమే మార్గదర్శి
అతిపెద్ద కార్పొరేట్ మోసం మార్గదర్శి చిట్‌ఫండ్స్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని సీఐడీ తేల్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్‌లపై ఇప్పటికే కేసు నమోదు చేసింది. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల డబ్బులను మళ్లించి అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై కొరడా ఝళిపించింది. ప్రధానంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయా ఎంటర్ ప్రైజస్‌లో ఉన్న వాటాలను అటాచ్ చేసింది. రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో ఇవే ప్రధాన విభాగాలు కావడం గమనార్హం.
మార్గదర్శిలో ఏ ఏ అవకతవకలు.?
- ఆదాయపు పన్ను శాఖ చట్టానికి వ్యతిరేకంగా అక్రమ నగదు లావాదేవీలు
- మార్గదర్శి పేరిట చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు
- ఖాతాదారులకు రూ.కోట్లలో బకాయిలు
- బ్యాంకు అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు
- చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు (డిపాజిట్లకు అనుమతి లేదు)
- ఖాతాదారులకు తెలియకుండానే చిట్ నుంచి డిపాజిట్లుగా మార్పు
మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించింది రామోజీ సంస్థ. మార్గదర్శి చిట్‌ఫండ్స్ వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు రూ.1,035 కోట్లను ఇప్పటికే అటాచ్ చేసింది. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉన్న 88.50 శాతం వాటాతోపాటు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్‌లో 44.55 శాతం వాటా అటాచ్ అయింది.
చదవండి: Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14
రెండు కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు
చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. వాటిలో రెండు కేసుల్లో న్యాయస్థానంలో చార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్, ఏ–3 మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లు (ఫోర్‌మెన్)తోపాటు మొత్తం 15 మందిపై క్రిమినల్ కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకానికి పాల్పడటం, రికార్డులను తారుమారు చేయడం తదితర నేరాలతోపాటు ఏపీ డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
చందాదారులకు తెలియకుండా.. న్యాయస్థానం కళ్లుగప్పి
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన 23 చిట్టీ గ్రూపుల మూసివేతకు సంబంధించి రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వెనుక లోగుట్టు బయటపడింది. న్యాయస్థానంలో పిటిషన్లు వేసిన కొందరు చందాదారులకు అసలు తమ పేరుతో అవి దాఖలైన విషయమే తెలియదని వెల్లడైంది. కొన్ని పత్రాలపై చందాదారుల సంతకాలు తీసుకుని రామోజీ తరపు మనుషులే పిటిషన్లు దాఖలు చేసినట్టు తేలింది.
తమ పేరిట పిటిషన్లు దాఖలైన విషయమే తెలియదని పలువురు ఇప్పటికే వెల్లడించారు. అది న్యాయస్థానాన్ని మోసం చేయడం కిందకే వస్తుందని CID స్పష్టం చేసింది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఎవరైనా పత్రాలు అందచేసి సంతకాలు చేయాలని కోరితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు క్షుణ్నంగా చదవాలన్నారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయవద్దని సూచించారు.
చదవండి: Live: చంద్రబాబు కేసు అప్డేట్స్..
ఎస్టేట్‌ను కాపాడుకునేందుకు ఫోర్త్ ఎస్టేట్
‘చిట్‌ఫండ్ చట్ట నిబంధనల అమలులో భాగంగా విజయవాడ, గుంటూరు, అనంతపురం, నర్సరావుపేట, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నంలలోని చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. పలు ఉల్లంఘనలను, అక్రమాలను గుర్తించారు. దీంతో మార్గదర్శి.. చిట్ మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ ఖాతాలకు బదిలీ చేసింది. సెక్యూరిటీ ముసుగులో డిపాజిట్లు ఆమోదించింది. బ్యాలెన్స్ షీట్లను కూడా సమర్పించలేదు. దీంతో రిజిస్ట్రార్లు సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదులు ఇచ్చారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్, రామోజీరావు, కిరణ్, శైలజా కిరణ్ తదితరులపై కేసులు నమోదు చేశారు.
దీన్ని భరించలేని రామోజీరావు తదితరులు మీడియా ముసుగులో ఈనాడులో తప్పుడు కథనాలతో సీఐడీపై విషం చిమ్మారు. తమ ఎస్టేట్‌ను కాపాడుకునేందుకు ఫోర్త్ ఎస్టేట్‌ను వాడుకుంటున్నారు. వారి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్న దుగ్దతోనే ఇదంతా చేశారు.
కర్త, కర్మ, క్రియ రామోజీరావే
‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషాకిరణ్ మూవీస్, కలోరమా ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితరాలకు రామోజీరావే కర్త, కర్మ, క్రియ. ప్రజల నాడిని, మనస్సులను ఆయనకు కావాల్సిన విధంగా మార్చగలనని రామోజీరావు భావిస్తుంటారు. వ్యవస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి, దాని పేరు ప్రతిష్టలను మంటగలపడాన్ని రామోజీరావు తదితరులు పిల్లాటగా భావిస్తుంటారు. వారి ప్రయోజనాలకు అతికేలా, ప్రతిష్టాత్మక సంస్థ సీఐడీపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ఈనాడులో కథనాన్ని ప్రచురించారు. సీఐడీపై యుద్ధం ప్రకటించారు. రామోజీరావు, ఆయన కుమారుడు, కోడలిని రక్షించేందుకు మిగిలిన నిందితులు సాయం చేశారు.