money lending
-
నెలకు రూ.400 కోట్ల రుణాలిచ్చే కంపెనీ.. మూసివేస్తున్నట్లు షాకింగ్ కామెంట్లు..
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ జెస్ట్‌మనీ తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. వ్యాపారం పునరుద్ధరించడానికి ఎన్నో ప్రయాత్నాలు చేశామని, కానీ అవి ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో తమ వద్ద పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు షాకింగ్ కామెంట్లు చేసింది. దేశంలో ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా రుణాలపై ఆధారపడుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. భారత ప్రజల్లో వస్తు వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక ‘బై నౌ పే లేటర్’ ఫిన్ టెక్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇవి షాపింగ్ కోసం ప్రజలకు తక్కువ ఖర్చుతో రుణాలు కల్పిస్తున్నాయి. అలా ఏడాళ్ల కిందట జెస్ట్‌మనీ కంపెనీ ప్రారంభమైంది. దేశంలో ఈ వ్యాపార మోడల్‌పై నియంత్రణ చట్టాల్లో వచ్చిన మార్పులు కంపెనీని దెబ్బతీసినట్లు సమాచారం. దాంతో బిజినెస్ పునరుద్ధరించడంలో విఫలమైనట్లు కంపెనీ ప్రకటించింది. చివరికి సంస్థను మూసివేస్తున్నట్లు తెలిపింది. కంపెనీలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పింది. మూసివేతకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేసే వరకు కొంతమంది కంపెనీలోనే ఉండనున్నట్లు వివరించింది. తొలగించిన ఉద్యోగులకు డిసెంబర్ నెల వేతనం ఇస్తామని జెస్ట్‌మనీ హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే కొత్త ఉద్యోగం వెతుక్కోవడంలోనూ వారికి సహాయం చేస్తామని చెప్పినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో జెస్ట్మనీను ఫోన్‌పేకు విక్రయించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ఒప్పందం కుదురకపోవడంతో కంపెనీ ముగ్గురు సహ వ్యవస్థాపకులు రాజీనామా చేశారు. దీంతో సంస్థ కొత్త నాయకత్వ బృందాన్ని నియమించింది. అయినా మూలధన అవసరాల నిమిత్తం నిధులను సమీకరించడం కష్టంగా మారింది. ఫలితంగా కంపెనీ మూసివేత అనివార్యమైందని సమాచారం. ఇదీ చదవండి: రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత! వాస్తవానికి కంపెనీని 2016లో లిజ్జీ చాప్మన్, ప్రియా శర్మ, ఆశిష్ అనంతరామన్ స్థాపించారు. కంపెనీ 17 మిలియన్ల కస్టమర్లను కలిగి ఉండి నెలకు రూ.400 కోట్ల రుణాలను పంపిణీ చేసేది. దేశంలో 10,000 ఆన్లైన్ బ్రాండ్లు, 75,000 ఆఫ్‌లైన్ స్టోర్లతో 27 రుణ, వ్యాపార భాగస్వాములను కలిగి ఉండేది. ఈ క్రమంలో నియంత్రణ చట్టాల్లో వచ్చిన మార్పులతో వ్యాపారాన్ని కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని నెలల కిందట కంపెనీ యజమానులు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 60 వేల కోట్లు
న్యూఢిల్లీ: మారటోరియంపరమైన ఆంక్షలు తొలగి, పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించిన యస్ బ్యాంక్‌కు అత్యవసరంగా నిధులు అవసరమైన పక్షంలో తోడ్పాటునిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. సుమారు రూ. 59,000 కోట్ల మేర రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. డిపాజిట్‌దారులకు చెల్లింపులు జరపడంలో సమస్యలు తలెత్తకుండా యస్ బ్యాంక్‌కు ఇది తోడ్పడుతుంది. అయితే, దీనిపై యస్ బ్యాంక్ సాధారణంగా కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2004లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆర్బీఐ ఇదే తరహా రుణ సదుపాయం కల్పించింది. అటుపై 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. అప్పట్లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం చేశారు. గడిచిన కొన్నాళ్లుగా విత్‌డ్రాయల్స్ కన్నా డిపాజిట్లే అధికంగా ఉన్నాయని, యస్ బ్యాంక్ ఇప్పటిదాకానైతే రుణ సదుపాయం వినియోగించుకోలేదని .. అసలు ఆ అవసరం కూడా రాకపోవచ్చని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఖాతాదారుల సొమ్ము భద్రంగానే ఉందని యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ మరోసారి భరోసానిచ్చారు. బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని, బైటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రుణ వితరణలో లొసుగులు, మొండిబాకీలు, నిధుల కొరతతో సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌పై మార్చి 5న ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ సహా పలు బ్యాంకులు పెట్టుబడులు పెట్టడంతో బుధవారం నుంచి యస్ బ్యాంక్ కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. పూరి జగన్నాథుని డిపాజిట్లు ఎస్బీఐలోకి మళ్లింపు.. పూరి జగన్నాథస్వామి ఆలయానికి చెందిన రూ. 389 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాను ఎస్బీఐకి బదలాయించినట్లు యస్ బ్యాంక్ తెలిపింది. ఈ ఎఫ్డీపై రూ. 8.23 కోట్ల మేర వడ్డీ జమైనట్లు వివరించింది. మరో రూ. 156 కోట్ల రెండు ఎఫ్డీలను ఈ నెలాఖరులోగా బదలాయించనున్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణన్ కుమార్‌కు యస్ బ్యాంక్ లేఖ రాసింది. ఈడీ విచారణకు అనిల్ అంబానీ.. యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ తదితరులపై మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఆయన్ను దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించినట్లు. ఈ నెల 30న మరోసారి హాజరు కావాలని సూచించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అంబానీ గ్రూప్‌నకు చెందిన తొమ్మిది కంపెనీలు యస్ బ్యాంక్ నుంచి రూ. 12,800 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. బడా కార్పొరేట్లకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించినందుకు గాను రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు రూ. 4,300 కోట్ల పైగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, మార్చి 21న విచారణకు హాజరు కావాలంటూ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రకు ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. -
నడిరోడ్డుపై మహిళను తంతూ..
చండీగఢ్ : అప్పు తీర్చలేదంటూ తన అనుచురులతో కలిసి ఓ మహిళను రోడ్డు మీద దారుణంగా చితకబాదాడో కాంగ్రెస్ నాయకుడి సోదరుడు. వివరాలు.. ముక్త్సర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ రాకేష్ చౌదరి సోదరుడు తన అనుచరులతో కలిసి ఓ మహిళను విచక్షణా రహితంగా కొట్టారు. అప్పు తీర్చే విషయంలో వివాదం తలెత్తడంతో సదరు మహిళను రోడ్డు మీద పడేసి కాళ్లతో తంతూ.. దారుణంగా హింసించారు. మరో మహిళ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. Muktsar: Woman thrashed by brother of Congress Councillor Rakesh Chaudhary and his aides over a money lending issue. SSP Manjeet Dhesi says 'This is an extremely unfortunate incident, we have arrested 6 ppl and will push for severe punishment.Victim admitted to hospital' #Punjab pic.twitter.com/J5PyfZJoi2 — ANI (@ANI) June 14, 2019 ఈ విషయం గురించి ఎస్ఎస్సీ మంజీత్ దేశి మాట్లాడుతూ.. ‘జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇందుకు బాధ్యులైన ఆరుగురు వ్యక్తులను గుర్తించాం. వారిని కఠినంగా శిక్షిస్తాం’ అని తెలిపారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. -
అప్పు డబ్బులు అడిగినందుకు వ్యక్తి హత్య
పాణ్యం(కర్నూలు జిల్లా): తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తిని వేటకొడవలితో నరికేశాడు. ఈ సంఘటన పాణ్యం మండలం కౌలూరులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. కౌలూరు గ్రామానికి చెందిన యేసఫ్(55) అనే వ్యక్తి వద్ద అదే గ్రామానికి చెందిన చెట్ల గోపాల్ సుమారు రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. ఎప్పుడు అడిగినా తర్వాత ఇస్తా అని సమాధానం ఇవ్వడంతో కోర్టు ద్వారా నోటీసులు పంపించాడు. దీంతో కోపం పెంచుకున్న గోపాల్.. నాకే నోటీసులు పంపిస్తావా అని తనతో తెచ్చుకున్న వేటకొడవలితో యేసఫ్‌ను నరికి హత్యచేశాడు. ఘటన అనంతరం నిందితుడు గోపాల్ అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.