ఓ మహిళకు క్లాస్ తీసుకున్న మంత్రి...
నల్లగొండ: గుడుంబా, కల్తీ మద్యం విక్రయించినా.. సేవించినా పోలీసులు, అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం చూస్తుంటాం. అదే తీరున గుడుంబా అంశాన్ని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. గుడుంబా అమ్ముతున్న మహిళతో మాట్లాడిన మంత్రి గుడుంబా విక్రయం ఇకనుంచి మానేయాలని ఆమెను హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో బుధవారం సాయంత్రం మంత్రి టి. పద్మారావు ఆకస్మిక పర్యటనకు వెళ్లారు.
తనిఖీలలో భాగంగా గొల్లగూడలో గుడుంబా అమ్ముతున్న ఓ మహిళతో మాట్లాడారు. అమ్మకం మానేసి వేరే ఉపాధి మార్గం చూసుకోవాలని హెచ్చరించారు. అందుకు ఆ మహిళ మా దగ్గర డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి సారూ.. అని మంత్రి దగ్గర వాపోయింది. ఆ మహిళ బాధల్ని విన్న మంత్రి ఉన్నపలంగా తన వద్ద ఉన్న రూ. 50 వేలు ఆమెకు ఇచ్చి వ్యాపారం చేసుకోవాలని సూచించారు.