భారత్ నుంచి బంగ్లా బేకరీ ఉగ్రదాడి ఆయుధాలు
ఢాకా: బంగ్లాదేశ్‌లోని బేకరీలో ఉగ్రవాదులు దాడికి వాడిన ఆయుధాల రూపును భారత్‌లోని బిహార్‌లో మార్చారని బంగ్లాదేశ్ ఉగ్ర నిరోధక చీఫ్ మొనిరుల్ ఇస్లాం పేర్కొన్నారు. ఢాకాలో జూలై 1న ఉగ్రవాదులు, ఒక భారతీయ యువతి సహా 20 మందిని గొంతులు కోసి చంపిన సంగతి తెలిసిందే.
ఉగ్రదాడి అనంతరం స్వాధీనం చేసుకున్న మూడు ఏకే22 తుపాకులపై బిహార్‌లోని ముంగార్‌లో ఉన్న ఒక ఫ్యాక్టరీ స్టిక్కర్ ఉందని ఆయన చెప్పారు. దాడికి ఒక నెల ముందే మామిడి కాయల బుట్టల ద్వారా తుపాకులు, కొన్ని చిన్న ఆయుధాలు ఢాకాలో ఉన్న ఉగ్రవాదులకు చేరాయని ఆయన వివరించారు.