‘పరిశోధన’ కొనసాగించేందుకు నిధులిస్తాం
న్యూఢిల్లీ: మేధోవలసలను నిరోధించడానికి కేంద్రం ‘నేషనల్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్’ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పీహెచ్డీ పూర్తి చేసిన సైన్స్ స్కాలర్లు తమ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్‌ను కొనసాగించేందుకు నిధులు అందజేయాలని నిర్ణయించింది.
పరిశోధన కొనసాగించే స్కాలర్లకు మూడేళ్లపాటు నెలకు రూ.50 వేలు ఇస్తామని, ఏడాదికి రూ.7 లక్షలు బేసిక్ గ్రాంట్ ఇస్తామని శాస్త్రసాంకేతిక కార్యదర్శి అశుతోశ్ శర్మ తెలిపారు.