అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు
సాక్షి, న్యూఢిల్లీ : అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. టోక్యో ఒలంపిక్స్, ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు నెలకు 50 వేల రూపాయలను నెలసరి ఖర్చుల కింద చెల్లిస్తున్నట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ శుక్రవారం ప్రకటించారు. అభినవ్ బింద్రా నేతృత్వం వహిస్తున్న ఒలంపిక్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులను సైతం ఆమోదించినట్లు ఆయన చెప్పారు.
టార్గెట్ ఒలంపిక్స్ స్కీమ్ కింద 152 మంది క్రీడాకారులను ఎలైట్ ప్యానెల్లో చేర్చినట్లు రాథోడ్ చెప్పారు. ఎలైట్ప్యానల్కు ఎంపికైన 152 మంది క్రీడాకారులకు ఈ అవకాశం వర్తిస్తుందని అన్నారు. ఈ నెలసరి ఖర్చుల మొత్తాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్లో కూడా పేర్కొన్నారు.
MYAS @IndiaSports announces Rs 50k/month pocket allowance for 152 elite athletes preparing for Tokyo/CWG/Asian Games. Athletes first,always!
— Rajyavardhan Rathore (@Ra_THORe) 15 September 2017
The allowance applies wef 1 Sep 2017 & is purely for pocket expenses of elite athletes.Committed to providing all resources to our champions
— Rajyavardhan Rathore (@Ra_THORe) 15 September 2017