mortgage loans
-
‘ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యా’..మూడు నిమిషాల్లో 900 మంది తొలగింపుపై..
అనాలోచితమైన నిర్ణయాల కారణంగా నిత్యం వార్తల్లో నిలిచే మోర్టగేజ్ లెండింగ్ కంపెనీ బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ మంచి నాయకుడిగా ఎదిగేందుకు శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా టెక్నాలజీ మీడియా సంస్థ టెక్‌క్రంచ్ విశాల్ గార్గ్‌తో ఇంటర్వ్యూ జరిపింది. ఈ సందర్భంగా బెటర్ డాట్ కామ్‌లో మంచి బాస్‌గా ఉండేందుకు చాలా ప్రయత్నించినట్లు తెలిపారు. 2021 డిసెంబర్ నెలలో సీఈవో విశాల్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల్లో 900 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు మూటగట్టుకున్నారు. లేఆఫ్స్ బాధితుల్లో అధిక వేతనాలు తీసుకున్న 250 మందికి పైగా ఉన్నారు. వాళ్లే చేయాల్సి పనివేళల గంటే ఎక్కువ సేపు పనిచేశారని ఫార్చ్యూన్ మ్యాగజైన్ తెలిపింది. శిక్షణ తీసుకున్నా అయితే, ఆ భారీ లేఆఫ్స్ తర్వాత మంచి బాస్‌గా ఎదిగేందుకు, సిబ్బంది తనని నమ్మేలా ప్రయత్నించినట్ల, ఇందుకోసం ట్రైనింగ్ తీసుకున్నట్లు టెక్ క్రంచ్‌కు చెప్పారు. తద్వారా ఉద్యోగులను చూసే ధోరణి మార్చుకున్నానని, వారిపట్లు సానుభూతితో మెలిగేలా శిక్షణ తీసుకున్నారు. కస్టమర్లతో సైతం అదే తరహాలో ఉండేలా కష్టపడినట్లు వెల్లడించారు. చిన్న లాజిక్ అర్ధమైంది కంపెనీ లక్ష్యం, సంస్థ ఎదుగుదలతో పాటు కస్టమర్లకు సంతృప్తి కలిగించడంపై దృష్టి సారించినట్లు గార్గ్ పేర్కొన్నారు. తన క్లయింట్లు సంతృప్తి చెందాలంటే తన ఉద్యోగులు సంతోషంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని తాను గ్రహించినట్లు చెప్పారు. ప్రస్తుతం Better.com లో వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నారని గార్గ్ తెలిపారు. ఇటీవలే అరోరా అక్విజిషన్ కార్ప్ అనే సంస్థతో గార్గ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఈ డీల్ కొంతకాలం వాయిదా పడింది. బెటర్.కామ్ షేర్లు నాస్డాక్ స్టాక్ మార్కెట్లో బీఈటీఆర్ గుర్తును ఉపయోగించి ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే ట్రేడింగ్ ప్రారంభం కాగానే షేరు విలువ 90 శాతానికి పైగా పడిపోయింది. ఇక, తాజాగా టెక్‌క్రంచ్ జూమ్ ఇంటర్వ్యూతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సంస్థ బాగుండాలంటే ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే లాజిక్‌ను ఎలా మిస్ అయ్యారని ప్రశ్నిస్తున్నారు. తనని తాను మార్చుకునే దిశగా విశాల్ గార్గ్ శిక్షణ తీసుకోవడంపై అభినందనలు తెలుపుతున్నారు. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Benjamin Young Savage (ᐱᓐᒋᐱᓐ) (@benjancewicz) December 3, 2021 -
ఎస్బీఐ బంపర్ ఆఫర్..! అతి తక్కువ ధరకే ఇళ్లను సొంతం చేసుకోండిలా..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 25న దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ-ఆక్షన్‌లో పాల్గొన వచ్చని తెలిపింది. సాధారణంగా అత్యవసర లోన్ కోసం బ్యాంక్‌లో ఆస్తుల్ని చూపెట్టి..వాటి ఆధారంగా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. వాటినే మాటిగేజ్ లోన్ అంటారు. ఒకవేళ తీసుకున్న లోన్ తీర్చలేని పక్షంలో సంబంధిత బ్యాంక్‌లు మాటిగేజ్‌లో ఉన్న ఆస్తుల్ని వేలం వేస్తాయి. ఇప్పుడు ఎస్బీఐ కూడా అదే చేస్తోంది. ఈ నెలలో దేశ వ్యాప్తంగా మాటిగేజ్ లోన్లపై ఉన్న ఆస్తులపై ఈ-వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.ఈ-వేలంలో మాటిగేజ్ ఇళ్లు, ప్లాట్లు, కమర్షియల్ స్పేస్‌లను ప్రస్తుత మార్కెట్ కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చని ట్వీట్లో పేర్కొంది. Your next big investment opportunity is here! Join us during the e-auction and place your best bid. Know more: https://t.co/vqhLcagoFF #Auction #EAuction #Properties #SBIMegaEAuction pic.twitter.com/e24yoxgh1C — State Bank of India (@TheOfficialSBI) October 13, 2021 మాటిగేజ్‌లో పాల్గొనేందుకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ► ఈ - ఆక్షన్‌లో పాల్గొనే వారికి ఈఎండీ (Earnest Money Deposit) తప్పసరిగా ఉండాలని ఎస్బీఐ పేర్కొంది. ► కేవైసీ డాక్యుమెంట్లను సంబంధిత ఎస్ బీఐ బ్రాంచ్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ► వ్యాలిడ్ డిజిటల్ సిగ్నేచర్ తప్పని సరిగా కావాలి. ఇందుకోసం ఆక్షన్‌లో పాల్గొనే వారు డిజిటల్ సిగ్నేచర్ కోసం ఎస్బీఐ బ్రాంచ్ అధికారుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. లేదంటే ఏజెన్సీలను ఆశ్రయించవచ్చు. ► ఎస్బీఐ బ్రాంచ్‌లో ఈఎండీ, కేవైసీ డాక్యుమెంట్లను సబ్మిట్ చేసిన తర్వాత వేలంలో పాల్గొనే బిడ్డర్లకు అధికారిక మెయిల్‌కు లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌లను పంపిస్తారు. అనంతరం వేలం నిబంధనల ప్రకారం ప్రకటించిన తేదీల్లో ఇ-వేలంలో పాల్గొనాలి ఎస్ బీఐ ఈ-ఆక్షన్‌లో ఎలా పాల్గొనాలి ► అధికారిక బిడ్డింగ్ పోర్టల్‌ను విజిట్ చేసి మీ అడ్రస్ ఫ్రూప్‌తో పాటు మెయిల్ ఐడీకి సెండ్ చేసిన పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి ► లాగిన్ అయిన తర్వాత నిబంధనలు, షరతుల్ని అంగీకరించి 'పార్టిసిపేట్' అనే బటన్‌పై క్లిక్ చేయండి. ► అవసరమైన కేవైసీ పత్రాలు, ఈఎండీ వివరాలు, ఎఫ్ఆర్క్యూ (మొదటి రేటు కోట్) ధరను అప్లోడ్ చేయాలి. ► పత్రాలను సమర్పించిన తర్వాత, కోట్ ధరను సమర్పించాలి. ఆస్తి లేదా ఆస్తి యొక్క రిజర్డ్వ్ విలువకు సమానంగా లేదా ఎక్కువగా ఉంటుంది. ► అవసరమైన వివరాలను, కోట్ ధరను పూర్తి చేయాలి. ఆపై సబ్మిట్ చేసి ఆ తర్వాత చివరిగా బటన్ పై క్లిక్ చేయండి. చివరిగా 'బ్రాంచ్‌లలో వేలం కోసం నియమించబడిన అధికారి ఉంటారు. వేలంలో పాల్గొనే వారు ఎవరైనా సరే వేలం ప్రక్రియ, లేదంటే ఈవేలంలో కొనుగోలు చేసే ఆస్తుల్ని తనిఖీ చేయాలంటే అధికారిని సంప్రదించవచ్చని' ఎస్బీఐ తెలిపింది. చదవండి: SBI: టాక్స్ పేయర్లకు ఎస్బీఐ గుడ్‌న్యూస్...! -
తనఖా రుణాలలో వృద్ధి
సాక్షి, హైదరాబాద్: దేశంలో మార్టిగేజ్ లోన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. 1990లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతంగా ఉన్న తనఖా రుణాల వాటా.. ప్రస్తుతం 11 శాతానికి చేరిందని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తెలిపింది. దీని విలవు సుమారు రూ.27 లక్షల కోట్లుగా ఉందని ఇటీవల జరిగిన ‘ట్రాన్స్ఫార్మింగ్ మార్టిగేజ్ లెండింగ్ ఫర్ డిజిటల్ ఇండియా’ వెబినార్ సదస్సులో పాల్గొన్నారు. ఎన్‌హెచ్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భావే తెలిపారు. గత ఐదేళ్లుగా దేశీయ గృహ రుణ మార్కెట్ 30 శాతం మేర వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే 2021 ఆర్థిక సంవత్సరంలో రుణ పంపిణీ 185 శాతం పెరిగిందని చెప్పారు. ఇందులో 65 శాతం లోన్లు బ్యాంక్‌లు అందించాయి. ఇప్పటివరకు దేశంలోని అన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తెలంగాణలో రూ.17,970 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.5,730 కోట్ల గృహ రుణాలను అందించాయి. చదవండి: గృహ రుణాలలో 26 శాతం వృద్ధి -
ఐసీఐసీఐ బ్యాంక్ హౌసింగ్ లోన్స్ రికార్డ్
ముంబై: మార్టిగేజ్ రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 2 లక్షల కోట్లను అధిగమించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. దేశీయంగా ఈ ఫీట్‌ను సాధించిన తొలి ప్రయివేట్ రంగ సంస్థగా నిలిచినట్లు తెలియజేసింది. హౌసింగ్ రుణాలలో బ్యాంక్ తొలిసారి 2016లో రూ. ట్రిలియన్ మార్క్‌ను చేరుకున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్‌లో రికార్డ్‌స్థాయిలో మార్టిగేజ్ రుణాలను మంజూరు చేసినట్లు తెలియజేసింది. వెరసి కోవిడ్-19కు ముందు స్థాయిని సైతం అధిగమించినట్లు వివరించింది. ఇదే విధంగా అక్టోబర్‌లోనూ రికార్డును నెలకొల్పుతూ అత్యధిక రుణాలను విడుదల చేసినట్లు తెలియజేసింది. ఈ బాటలో రానున్న నాలుగేళ్లలోగా రూ. 3 ట్రిలియన్ మార్టిగేజ్ లోన్ మార్క్‌ను అందుకోనున్నట్లు అంచనా వేసింది. కారణాలివీ.. రుణాల ప్రాసెసింగ్‌లో డిజిటైజేషన్, బిగ్ డేటా అనలిటిక్స్ వినియోగంతో క్లయింట్లకు రుణాలు ఆఫర్ చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోలో వృద్ధిని సాధించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. దాదాపు మూడో వంతు రుణాలను డిజిటలైజేషన్ ద్వారానే విడుదల చేసినట్లు తెలియజేసింది. ప్రధానంగా చౌక వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరల క్షీణత, కొన్ని రాష్ట్రాలలో తగ్గిన స్టాంప్ డ్యూటీ వంటి అంశాలు రుణాలకు డిమాండ్ పెంచినట్లు వివరించింది. దీనికితోడు వేగవంతమైన వృద్ధికి వీలున్న ద్వితీయ శ్రేణి పట్టణాలపై దృష్టిపెట్టినట్లు తెలియజేసింది. షేరు ఫ్లాట్.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు నామమాత్ర లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 490ను అధిగమించిన షేరు రూ. 472 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. -
సెప్టెంబర్ వరకూ తనఖా షేర్ల విక్రయం ఉండదు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్ గ్రూప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90 శాతం సంస్థలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా రుణదాతలకు గడువు ప్రకారమే వడ్డీ, అసలు చెల్లింపులను రిలయన్స్ గ్రూప్.. జరుపుతుంది. అంతే కాకుండా రిలయన్స్ పవర్లో రిలయన్స్గ్రూప్నకు నేరుగా ఉన్న 30 శాతం వాటాలో పాక్షిక వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించడం కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించింది. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు త్వరలో రోడ్‌షోలను నిర్వహిస్తారు. రిలయన్స్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్న రుణదాతల్లో టెంపుల్టన్ ఎమ్ఎఫ్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ఎమ్ఎఫ్, ఇండియాబుల్స్ ఎమ్ఎఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్‌లు ఉన్నాయి. కాగా తనఖా షేర్లు విక్రయించకుండా యథాతథ ఒప్పందం కుదిరినందుకు రుణదాతలకు రిలయన్స్ గ్రూప్ ధన్యవాదాలు తెలిపింది. తమపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞులమని రిలయన్స్ గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇటీవల రిలయన్స్ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఈ పతనం కారణంగా తనఖా పెట్టిన షేర్ల విలువ బాగా తగ్గినప్పటికీ, రుణదాతలు తనఖా షేర్లను విక్రయించబోమని తాజా ఒప్పందం ద్వారా అభయం ఇచ్చాయి. ఎడెల్వీజ్కు బకాయి రూ.150 కోట్లు తనఖా పెట్టిన షేర్లను ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎడెల్వీజ్ సంస్థలు అన్యాయంగా కావాలని ఓపెన్ మార్కెట్లో విక్రయించాయని, ఫలితంగా తమ కంపెనీల షేర్ల విలువలు భారీగా పడిపోయాయని రిలయన్స్ గ్రూప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఈ ఇరు కంపెనీలు ఖండించాయి. తనఖా ఒప్పందం ప్రకారమే షేర్లను విక్రయించామని, ఎలాంటి దురుద్దేశం లేదని ఎడెల్వీజ్ పేర్కొంది. కాగా క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఎడెల్‌వీజ్‌ను తక్షణం నిషేధించాలని కూడా సెబీని రిలయన్స్ గ్రూప్ కోరింది. కాగా రిలయన్స్ గ్రూప్ ఎడెల్వీజ్ సంస్థకు రూ.150 కోట్ల రుణం చెల్లించాల్సి ఉండగా, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ రుణం పూర్తిగా తీరిపోయింది. -
మోసగాడి అరెస్టు
కరీంనగర్‌క్రైం : వాహనాలు తనఖాపెట్టి మోసాలకు పాల్పడి ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని సీసీఎస్ సీఐ కిరణ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం సోమవారం పట్టుకుంది. కరీంనగర్‌లోని హెడ్‌క్వార్టర్‌లో విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లికి చెందిన వింజమూరి కళ్యాణ్‌చక్రవర్తి(39) తన తండ్రి తిరుపతయ్య నడిపిస్తున్న తిరుపతి డ్రైవింగ్ స్కూల్ వ్యవహారాలు చూసుకునేవాడు. ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులు, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఫైనాన్స్‌ల్లో రుణాలు తీసుకునే పద్ధతులపై అవగాహన పెంచుకున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ కళ్యాణ్‌చక్రవర్తి డబ్బుల కోసం పక్కదారితొక్కాడు. తన మిత్రుడు శ్రీరామోజు వెంకటేశ్వర్లుకు చెందిన కారును తరచూ అవసరాలకు వాడుకునేవాడు. వెంకటేశ్వర్లు కారుతో బ్యాంక్ లోన్ తీసుకుని ఠంఛన్‌గా వాయిదాలు చెల్లిస్తున్నాడు. ఈ చనువుతో వెంకటేశ్వర్లు కారును తనకు విక్రయించినట్లు కళ్యాణ్‌చక్రవర్తి తప్పుడు పత్రాలు సృష్టించి, బ్యాంక్ లోన్ చెల్లించినట్లు నకిలీ ఎన్వోసీ తయారు చేశారు. వీటిని ఆర్టీఏ అధికారులకు సమర్పించి మరో ఫైనాన్స్‌లో లోను తీసుకున్నాడు. ఇలా ఒక్క వెంకటేశ్వర్లుకు చెందిన కారుపై 2016–17లో ఆరు ఫైనాన్స్‌ల్లో సుమారు రూ.20లక్షలు రుణం తీసుకున్నాడు. అంతేకాకుండా తన పేరిట ఉన్న రెండు లారీలపై నకిలీ ఎన్వోసీలు తయారు చేసి లోన్లు తీసుకున్నాడు. తల్లి వింజమూరి భాగ్యలక్ష్మి పేరిట ఉన్న రిట్జ్కారుపై లోను తీసుకుని దాన్ని తన మిత్రుడు చందనారెడ్డి పేరిట మార్చి మళ్లీ లోను తీసుకున్నాడు. ఇలా మూడేళ్లలో మారుతి స్విఫ్ట్‌డిజైర్, మారుతిరిట్జ్, రెండులారీలపై నకలీపత్రాలు తయారుచేసి రూ.70లక్షలు వరకు వివిధ ఫైనాన్స్‌ల నుంచి లోన్లు తీసుకున్నాడు. వెలుగుచూసింది ఇలా.. కళ్యాణ్ చక్రవర్తి తన మిత్రుడైన వెంకటేశ్వర్లు పేరిట ఉన్న కారుకు నకిలీపత్రాలు సృష్టించి ఆరు ఫైనాన్స్‌ల్లో లోన్లు తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించకపోవడంతో ఓ ఫైనాన్స్ కంపెనీ వారు కారు ఎక్కడ ఉందో కనుక్కొని వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. కానీ తాను ఎస్బీహెచ్లో లోను తీసుకుని.. వాయిదాలు చెల్లిస్తున్నానని చెప్పినా వినకుండా కారు లాక్కెళ్లారు. దీనిపై వెంకటేశ్వర్లు కరీంనగర్ వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ తుల శ్రీనివాసరావు విచారణ చేపట్టగా పై అంశాలు వెలుగుచూశాయి. దీంతోపాటు బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఐదు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు విషయం తెలుసుకున్న కళ్యాణ్ చక్రవర్తి తన కుటుంబంతో సహ పరారై హైదరాబాద్‌లో దాక్కున్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో నిందితుడిని కోసం గాలించేందుకు సీసీఎస్ సీఐ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు వారంపాటు హైదరాబాద్‌లో మకాం వేసి కళ్యాణ్ చక్రవర్తి కదలికలపై నిఘా పెట్టారు. ఆచూకీ కనిపెట్టిన పోలీసులు సోమవా రం ఉదయం అతడు దాక్కున్న ఇంటిపై దాడి చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు అతనికి సహకరించిన చందనారెడ్డిని సైతం అదు పులోకి తీసుకున్నారు. వారు పలు ఫైనాన్స్‌లను ఎలా మోసం చేశారో తెలుసుకున్నారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి, కస్టడీకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని సీపీ తెలిపారు. కళ్యాణ్ చక్రవర్తికి సహకరించిన వింజమూరి భాగ్యలక్ష్మి, షేక్ అబ్దుల్లా, నాగుల దేవేందర్, ఎండీ యూసుఫొద్దీన్ పరారీలో ఉన్నారని వారిని త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. కళ్యాణ్ చక్రవర్తి చేసిన మోసాల్లో చాలా వరకూ ఆర్టీఏ అధికారుల సహకారం ఉందనే ప్రచారం ఉంది. ఆర్టీఏ అధికారుల పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. అధికారులకు రివార్డులు ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ సీఐ కిరణ్, వన్‌టౌన్ సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్ ఎస్సైలు నాగరాజు, సాగర్‌ను అభినందించారు. -
ఐసీఐసీఐ బ్యాంకు తనఖా రుణాలు రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ రూ. లక్ష కోట్ల తనఖా రుణాల మైలురాయిని అధిగమించింది. ప్రైవేటు రంగంలో దేశంలో ఈ తరహా రికార్డు సాధించిన మొదటి బ్యాంక్ ఘనత సాధించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త గృహ రుణాల విషయంలో సత్వరం, సరళతర అసెస్మెంట్కు, ప్రాజెక్టుల నిర్మాణ దశకు సంబంధించి సులభతర రుణ పంపిణీలకు రెండు కొత్త డిజిటల్ ఆవిష్కణలను కూడా ప్రారంభించినట్లు బ్యాంక్ తెలిపింది. ఎక్స్‌ప్రెస్ హోమ్ లోన్స్పేరుతో ప్రారంభమైన పూర్తిస్థాయి ఆన్లైన్ హోమ్ లోన్ ఆమోద వ్యవస్థ ద్వారా అన్నీ సక్రమంగా ఉంటే ఎనిమిది గంటల్లో రుణానికి ఆమోదముద్ర పడుతుందని వివరించింది. ఉద్యోగులకు, నాన్-ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు అందరికీ ఈ వ్యవస్థ అందుబాటులో ఉంటుందని తెలిపింది.