'కేసీఆర్‌కి అలవాటుగా మారింది'
వరంగల్ : తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ని అభివృద్ది చేస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హన్స్ రాజ్ గంగారామ్ తెలిపారు. ఆదివారం వరంగల్‌లో ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హన్స్ రాజ్ గంగారామ్ మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాటమాటకు ఎన్నికలు జరగడం తెలంగాణ సీఎం కేసీఆర్‌కి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు.
వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అటు అధికార టీఆర్ఎస్.... ఇటు టీడీపీ - బీజేపీతోపాటు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థుల కోసం ముమ్మర ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 21న వరంగల్ ఉప ఎన్నిక జరగనుంది. 24వ తేదీన ఓట్లు లెక్కింపు జరుగుతుంది.