most beautiful lady
-
ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తె..
ప్రపంచం మొత్తంలో ఉన్న అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉన్నారు? అని అడిగితే ఎవరూ చెప్పలేరు. ఒకవేళ చెప్పగలిగినా.. ఏటా జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారే ప్రపంచంలోని అందమైన అమ్మాయి అని చెబుతారు. అయితే ప్రపంచ సుందరిని ఎంపిక చేసేందుకు సరికొత్త విధానం ఉంది. అదే గ్రీక్ మ్యాథమ్యాటిక్స్. గ్రీకు ‘లెక్కల’ ప్రకారం సూపర్ మోడల్ బెలా హదీద్ ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తె అని సౌందర్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అందాన్ని లెక్కించడానికి వాడే ‘గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై ’ప్రకారం ఈ భూమ్మీద ఉన్నవారందరిలో ఈ విక్టోరియా సూపర్ మోడలే ప్రపంచ అందగత్తె అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఆమె ముఖమే అత్యుత్తమమైనదిగా నిర్ధారణ అయ్యింది. క్లాసిక్ గ్రీక్ కాలిక్యులేషన్‌ను అనుసరించి ‘గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై’ ద్వారా అందానికి నిర్వచిస్తారు. ఇందుకోసం ముఖభాగాన్నికొలుస్తారు. దీని ఆధారంగా అందగత్తె ఎవరన్నదీ తేలుస్తారు. ‘గోల్డెన్ రేషియో’ లెక్కల ప్రకారం 23 ఏళ్ల బెలా ముఖాన్ని లెక్కించగా 94.35 శాతం మ్యాచ్ అయ్యింది. ఆమె తర్వాత స్థానాన్ని 92.44 మార్కులతో పాప్ సంచలనం బియాన్స్ కొట్టేసింది. 91.85 మార్కులతో హాలీవుడ్ నటి ఆంబర్ హర్డ్ మూడో స్థానంలో నిలిచారు. పాప్‌స్టార్ బియాన్స్ -
ఎవరిది అందం?... వివాదాస్పదం
సాక్షి, చెన్నై : తమిళనాడులో ఓ టీవీ ఛానెల్ నిర్వహించే టాక్‌షోలో చిత్రీకరించిన వివాదాస్పద ఎపిసోడ్ ప్రసారం అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. కేరళ-తమిళనాడు.. ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు అందంగా ఉంటారంటూ గత నెలలో ఓ చర్చా వేదికను నిర్వహించారు. దానిపై తీవ్ర దుమారం చెలరేగగా.. ఇప్పుడు పోలీసులు ఎపిసోడ్ టెలికాస్ట్ కానివ్వకుండా అడ్డుకుంటున్నారు. విజయా టీవీలో ప్రసారమయ్యే నీయా నానా(నువ్వా-నేనా) షోలో ఈ చర్చను నిర్వహించారు. కేరళ-తమిళనాడుకు చెందిన అమ్మాయిలు ఇందులో పాల్గొన్నారు. పైగా యాంకర్ గోపీనాథ్ ఈ విషయంలో ఆన్లైన్ పోల్ కూడా నిర్వహించారు. అయితే ఈ చర్చ అసమంజసంగా.. అభ్యంతరంగా ఉందంటూ కొంత మంది ఉద్యమకారులు, మహిళా మీడియా ప్రతినిధుల బృందం(ఎన్‌డబ్ల్యూఐఎం ) ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రసారం కావాల్సిన ఆ ఎపిసోడ్‌ను పోలీసుల ఆదేశాలతో దానిని రద్దు చేసినట్లు ఛానెల్ ప్రకటించింది. అయితే అది కేవలం వారి అభిప్రాయాలు మాత్రమేనని.. వారిలోని వ్యక్తిత్వాన్ని పెంపోందించేలా చర్చ కొనసాగిందని టాక్‌షో దర్శకుడు ఆంటోనీ చెబుతున్నారు. వామపక్ష భావజాలాలున్న కొందరు అభ్యంతరం వ్యక్తంచేసిన నేపథ్యంలోనే ఆ ఎపిసోడ్‌ను ప్రసారం చెయ్యనియ్యకుండా తమను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. సరిగ్గా టెలికాస్టింగ్ సమయంలో వారు వివాదం చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎన్‌డబ్ల్యూఐఎం ప్రతినిధి కవితా మురళిధరన్ స్పందించారు. ‘‘భావస్వేచ్ఛ ప్రకటనకు మేము భంగం కలిగించబోం. కాకపోతే మహిళలను కించపరిచేలా ఉందన్న విషయం ప్రోమోల ద్వారా స్ఫష్టంగా తెలిసిపోతుంది. అందం ఎవరిదన్న ప్రశ్నలు అంత స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే తాము ఎపిసోడ్‌ను అడ్డుకుంటున్నామని కవిత చెబుతున్నారు. -
ప్రపంచంలో అత్యంత అందగత్తె ఎవరంటే..!
అందాన్ని ఆరాధించని వాళ్లు ఉండరు. అందాల రాణుల పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. మరి ప్రపంచంలోనే అత్యంత అందగత్తె ఎవరో.. అసలు టాప్ 100 స్థానాల్లో ఎవరెవరు ఉన్నారోననే విషయాలు ఆసక్తి కలిగిస్తాయి కదూ. సరిగ్గా ఇదే విషయమై అమెరికాలో ప్రఖ్యాత పీపుల్స్ పత్రిక ప్రతియేటా నిర్వహించే తన సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. ఈ సంవత్సరం ప్రపంచంలో అత్యంత అందగత్తె కిరీటాన్ని జెనిఫర్ ఆనిస్టన్ (47)కు కట్టబెట్టింది. ఈ టైటిల్ దక్కడం పట్ల తనకు చాలా ఆనందంగా ఉందని ఆనిస్టన్ చెప్పింది. ఆమె తర్వాతి స్థానాల్లో వరుసగా రీస్ విదర్‌స్పూన్, సోఫియా వెర్గారా, కీక్ పామర్, సెలెనా గోమెజ్ ఉన్నారు. 1990 నుంచి ఇలా వరుసగా అందగత్తెల జాబితాను పీపుల్ పత్రిక వెల్లడిస్తోంది. ఇంతకుముందు కూడా ఒకసారి జెనిఫర్ ఆనిస్టన్‌కు ఈ టైటిల్ దక్కింది.