ధోని ‘మార్కెట్’ బాగుంది!
లండన్: టెస్టు క్రికెట్‌నుంచి తప్పుకున్నా వన్డే కెప్టెన్ ధోని మార్కెటింగ్ విలువ ఏ మాత్రం తగ్గలేదని మరో సారి రుజువైంది. ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ సంస్థ నిర్వహించిన ‘మోస్ట్ మార్కెటబుల్ స్టార్’ సర్వేలో ధోని 9వ స్థానంలో నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో (10), మెస్సీ (13)కంటే కూడా అతను ముందుండం విశేషం. టాప్-20 జాబితాలో ఉన్న ఏకైక క్రికెటర్ ధోని. రోజర్ ఫెడరర్ (1), టైగర్‌వుడ్స్ (2) అగ్రస్థానాల్లో ఉన్న ఈ లిస్ట్‌లో ఇద్దరు మహిళలు షరపోవా (12), సెరెనా (20) ఉన్నారు.