Mother India
-
ఇందిరాగాంధీ.. భారతమాత: సురేశ్ గోపీ
త్రిసూర్: ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధాని ఇందిరను ఆయన భారత మాత(మదర్ ఆఫ్ ఇండియా)గాను, కేరళ దివంగత సీఎం కె.కరుణాకరన్‌ను సాహసోపేతుడైన పాలకుడిగాను అభివర్ణించారు. త్రిసూర్ జిల్లా పుంకున్నమ్లో ఉన్న కరుణాకరన్ సమాధి ‘మురళి మందిరం’ను సురేశ్ గోపీ ఇటీవల సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన గురువుకు నివాళులర్పించేందుకే ఇక్కడికి వచ్చానని, దీనిని రాజకీయం చేయొద్దంటూ కోరారు. -
భరతమాత కొలువైన గుడి
గౌరిబిదనూరు: దేశంలో ముక్కోటి దేవీ దేవతలకు ఆలయాలు, ప్రఖ్యాత దేవస్థానాలు ఉన్నాయి, కానీ భరతమాత పేరుతో ఉన్న మందిరాలు ఎక్కడా కనిపించవు. దేశమాత విగ్రహ రూపంలో కొలువై పూజలందుకుంటున్న మందిరాన్ని చూడాలంటే గౌరిబిదనూరుకు వెళ్లాల్సిందే. దక్షిణ భారతదేశపు జలియన్ వాలాబాగ్‌గా ప్రసిద్ధి చెందిన విదురాశ్వత్థానికి సమీపంలో ఉన్న నాగసంద్ర గ్రామంలో 2008లో భారతమాత దేవాలయం వెలిసింది. కృష్ణశిలలో హిందూపురానికి చెందిన శిల్పి నాగరాజు 6 అడుగుల భరతమాత విగ్రహాన్ని చెక్కారు. జాతీయ జెండాను పట్టుకుని జెండా దర్శనమిస్తుంది. జనవరి 26, ఆగస్టు 15కు ప్రత్యేక పూజలు దేవాలయం పై కప్పున దేశ నాయకుల చిత్రాలు, బొమ్మలు స్ఫూర్తిని నింపుతాయి. కిత్తూరు రాణి చన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాస్ చంద్రబోస్ తదితరుల బొమ్మలను చెక్కారు. ఏటా ఆగస్టు 14 అర్ధరాత్రి దేశభక్తియుత ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీ. స్థానిక నాయకుడు రవి నారాయణరెడ్డి భరతమాత ట్రస్ట్ ఏర్పరచి ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయంలో భరతమాతకు నిత్య పూజలు నిర్వహిస్తూ, గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15న విశేష పూజలు జరుపుతారు. (చదవండి: చిన్నవాణ్ణని వదిలేశారు) -
మేరా బాలీవుడ్ మహాన్
నీవొక సైనికురాలివి... నేనొక సైనికుడిని ప్రత్యక్షంగా దేశాన్ని ప్రేమించి గళమెత్తి యుద్ధం చేసే సైనికులం మనం చేతిలో గన్ను లేకపోవచ్చు.. ఖడ్గం ఉండకపోవచ్చు కానీ మన చప్పట్లతో వీర జవాన్ల గుండెల్లో ధైర్యం నింపే సైనికులం మనం కుర్చీ అంచున కూర్చుని దేశభక్తిని ధ్వనించే గుండె మనది. సినిమా థియేటర్లో వినిపించే హోరు మనది స్వాతంత్య్రం వచ్చింది. ‘క్విట్ ఇండియా’, ‘వందేమాతరం’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘జైహింద్’, ‘స్వరాజ్ మేరా జన్మ్ సి«ద్ అధికార్ హై’ వంటి నినాదాలతో నాయకులు ప్రజలను ఉర్రూతలూగించి, లెక్కలేనన్ని త్యాగాలతో స్ఫూర్తి నింపి భారతమాత దాస్యశృంఖలాలను పెళ్ళగించి అవతల పారేయగలిగారు. దేశం ఉత్సాహంగా అడుగు ముందుకేసింది. ‘ఆరామ్ హరామ్ హై’ అంటూ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విరామమెరగక దేశ నిర్మాణంలో పడ్డారు. మరోవైపు అప్పటికే యవ్వనంలోకి అడుగుపెట్టిన హిందీ సినిమా ఆ స్ఫూర్తిని, ఆ తర్వాత అవసరమైన మార్గదర్శనాన్ని, ఆనాటి త్యాగాలను వీలువెంబడి వెండితెర మీద ప్రత్యక్షం చేస్తూ తాను నింప గల ఉత్సాహం తనూ నింపింది. ఎన్నో చిత్రాలు వచ్చాయి. కొన్ని మేలిమి ముత్యాలుగా నిలిచాయి. మదర్ ఇండియా... నయా దౌర్ భారతదేశం అంటే రైతు. భారతదేశం అంటే పంటచేను. భారతదేశం అంటే పల్లెసీమ. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశ గ్రామీణ చిత్రం ఎలా ఉందో చూపుతూ, భారతీయ రైతు స్త్రీ విముక్తే అసలైన దాస్య విముక్తి అని ప్రతిపాదిస్తూ ‘మదర్ ఇండియా’ (1957) సినిమా వచ్చింది. నర్గిస్ నట జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ సినిమా సంఘ వ్యతిరేకం అయితే ఈ దేశం కోసం సొంత బిడ్డను కూడా బలి ఇవ్వడానికి భారత మాతృమూర్తి వెనుకాడదని చెప్పి తేజస్సుతో నిండిన సందేశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘నయా దౌర్’ (1957) దేశంలో జరుగుతున్న యాంత్రికీకరణ, పారిశ్రామికీకరణ చర్చించింది. దేశీయ మూలాలను పదిలంగా ఉంచుతూ మార్పును స్వాగతించాలని సూచించింది. దిలీప్ కుమార్ నటించిన ఈ సినిమాలో ఓపి నయ్యర్ చేసిన ‘సాథీ హాత్ బఢానా’... అనే పాట కలిసి మెలిసి ముందుకు అడుగువేసేందుకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప బృందగీతం. హకీకత్.. బోర్డర్... లక్ష్య యుద్ధక్షేత్రం ఎలా ఉంటుందో తెలియకపోతే అసలైన దేశభక్తి ఎలా ఉంటుందో అర్థం కాదు. దేశం కోసం లేశమాత్రంగా ప్రాణం త్యాగం చేయడం ఎలా ఉంటుందో అర్థం కాదు. అందుకే బాలీవుడ్ మన దేశం ఎదుర్కొన్న యుద్ధాలను తన కథలుగా చేసుకుంది. 1962 వార్‌ను కథాంశంగా ‘హకీకత్’ (1964) తీసింది. ఇందులోని ‘కర్ చలే హమ్ ఫిదా’... పాట ఇవాళ్టికీ పర్వ దినాలలో మొగుతూ నరనరాల ఉద్వేగం నింపుతూనే ఉంటుంది. ఆ తర్వాత 1971 భారత–పాకిస్తాన్ల యుద్ధ నేపథ్యంగా ‘బోర్డర్’ (1997) వచ్చింది. సన్నిడియోల్, అక్షయ్ ఖన్నా తదితరులు నటించిన ఈ సినిమాలో ‘సందేశే ఆతేహై’.. పాట కుటుంబాలకు దూరంగా ఉండే సైనికుల వేదనను అశ్రువుల్లో చుట్టి వినిపిస్తుంది. ఇక దేశం చూపిన అతి గొప్ప సాహసం ‘కార్గిల్’ యుద్ధం. మన సైనికుల వీరత్వాన్ని చూపే ఈ యుద్ధం నేపథ్యంలో ‘లక్ష్య’ (2004) సినిమా వచ్చింది. ఫర్హాన్ అఖ్తర్ ఇందులో హీరో. భగత్‌సింగ్... సుభాష్... మంగళ్‌పాండే దేశం దేశనాయకులను ఎలా మర్చిపోదో బాలీవుడ్ కూడా మర్చిపోదు. దేశం కోసం త్యాగం చేసిన ఆ అమరవీరులను బాలీవుడ్ తన శక్తిమేరకు చూపించే సగటు ప్రేక్షకుడికి వారిని మరింత చేరువ చేసింది. భగత్ సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ (2002) అజయ్ దేవగణ్‌కు గొప్ప పేరు తెచ్చి పెట్టింది. సుభాస్ చంద్రబోస్ సమగ్ర జీవితాన్ని శ్యామ్ బెనగళ్ ‘బోస్: ది ఫర్గాటెన్ హీరో’ (2005)గా తీశాడు. ఇక ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ హీరో అయిన మంగళ్‌పాండే జీవితాన్ని అదే పేరుతో 2005లో కేతన్ మెహతా ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కించాడు. సర్దార్ పటేల్ జీవితాన్ని పరేశ్ రావెల్ అభినయిస్తే దేశీయ భాషల్లో అంబేద్కర్ జీవితం వచ్చింది. హిందూస్తానీ... వెడ్నెస్ డే ఇక దేశంలోని అంతర్గత సమస్యలైన అవినీతి ఉగ్రవాదం వంటి సమస్యలను కూడా బాలీవుడ్ చర్చించింది. శంకర్ తీసిన ‘హిందూస్తానీ’ (1996), నసీరుద్దీన్ షా నటించిన ‘వెడ్నెస్ డే’ (2008) చాలా ప్రతిభావంతంగా ఆ సమస్యలను చర్చించి ప్రేక్షకులను ఆలోచింప చేశాయి బాలీవుడ్ ఇంతటితో ఆగలేదు. సర్జికల్ స్ట్రయిక్స్‌ను కూడా కథాంశంగా తీసుకుని ‘ఉడి’ (2019) వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. రాబోయే రోజులలో మరెన్నో బయోపిక్‌లో గత కాలపు దేశ ఘనతలు వెండితెరను అలంకరించనున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ మనం మేరా భారత్ మహాన్ అనుకోవాలి. ఇండియా జిందాబాద్ అని గట్టిగా నినాదం ఇవ్వగలగాలి. ఈ దేశం పట్ల ప్రేమ, గౌరవం ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలని కోరుకుందాం. ఉప్కార్... పూరబ్ ఔర్ పశ్చిమ్ ఆ తర్వాత నటుడు మనోజ్ కుమార్ వచ్చి రెండు మూడు ముఖ్యమైన సినిమాలు తీశాడు. దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇటు కిసాన్, అటు జవాన్ ఇద్దరూ శక్తిమంతంగా ఉండాలనే లాల్‌బహదూర్ శాస్త్రి నినాదాన్ని ఊతంగా తీసుకొని ‘ఉప్కార్’ (1967) సినిమా తీశాడు. ‘ఏ దేశ్ కీ ధర్తీ’... పాట ఈ మట్టిలో మణులూ మాణిక్యాలు పండించడానికి స్వేదజలాన్ని చిందించే రైతుకు చేసిన శాల్యూట్ అని చెప్పవచ్చు. అదే సమయంలో మనోజ్ కుమార్ ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమా కూడా తీశాడు. స్వాతంత్య్రం వచ్చిందనే అత్యుత్సాహంలో ఇబ్బడి ముబ్బడిగా పాశ్చాత్య ప్రభావానికి లోనై మన సంస్కృతిని దెబ్బ తీయడానికి యువత ప్రభావితం కావద్దని చెబుతూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా నచ్చింది. చక్ దే ఇండియా.. భాగ్ మిల్కా భాగ్... దంగల్ మరో వైపు క్రీడల ద్వారా దేశభక్తిని నింపే ప్రయత్నం కూడా బాలీవుడ్లో జరిగింది. మహిళా హాకీ జట్టులో స్ఫూర్తి నింపే ‘చక్ దే ఇండియా’ (2007) సినిమా ఘన విజయం సాధించింది. షారుక్ ఖాన్ నటించడంతో ఈ సినిమా యువతను క్రికెట్ నుంచి ఆ ఆటవైపు చూసేలా చేసింది. ‘ఫ్లయింగ్ సిక్’గా పేరుగాంచిన మిల్కాసింగ్ జీవితం ‘భాగ్ మిల్కా భాగ్’ (2013)గా రావడం ఒక ముఖ్య సన్నివేశం. ఫర్హాన్ అక్తర్ ఈతరం ప్రేక్షకులకు తెలియని మిల్కాసింగ్‌ను గొప్పగా తెర మీద చూపించగలిగాడు. ఇక ఏ దేశంలో అయితే స్త్రీలను వంటింటి పరిమితం చేస్తారనే పేరు ఉందో ఏ దేశంలో అయితే స్త్రీలను అణిచి ఉంచుతారనే ప్రచారం ఉందో ఆ దేశంలో నుంచి బాక్సింగ్ చేసే అమ్మాయిని ‘మేరీ కోమ్’ (2014)లో, కుస్తీ ఆడే ఆడపిల్లను ‘దంగల్’ (2016)లో చూపి దేశ మహిళల ఘనతకు ఒక నివాళి అర్పించగలింది. దంగల్ -
రచయిత విషాద ‘మరణం’
ఎన్నడో 1927లో అమెరికన్ రచయిత్రి కేథరిన్ మయో ‘మదర్ ఇండియా’ పేరుతో పుస్తకం రాశారు. మూర్తీభవించిన జాత్యహంకారంతో ఆమె హిందూ మతాన్ని, సమాజాన్ని, ఈ దేశ సంస్కృతిని కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేశారు. అమెరికా పౌరులు భారత స్వాతంత్య్రోద్యమాన్ని తమ దేశ విప్లవంతో పోల్చుకుంటూ మద్దతు పలుకుతున్న వేళ బ్రిటిష్ పాలకులకు ఈ పుస్తకం రావ(య)డం అవసరమైంది. వారు దాన్ని ఎంతగానో ప్రచారంచేసి తమ వలస పాలనను సమర్థించుకున్నారు. మహాత్మా గాంధీ ఈ పుస్తకాన్ని ‘డ్రైనేజ్ ఇన్స్పెక్టర్ రిపోర్టు’గా అభివర్ణించారు. అంతేకాదు... భారతీయులంతా ఆ పుస్తకాన్ని చదివి తీరాలని సూచించారు. మనకు నచ్చని అంశాలున్నా, మన అభిప్రాయాలతో విభేదించే విషయాలున్నా రాజ్యాంగాన్నీ, రాజ్యాంగదత్తమైన భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించేవారంతా చేయాల్సిన పని అది. దురదృష్టవశాత్తూ దేశంలో అలాంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి రోజురోజుకూ కరువవుతున్నది. తమ మనోభావాలను దెబ్బతీశారని వీధులకెక్కి గొడవచేసి దేన్నయినా సాధించుకునే ‘మాబోక్రసీ’ విస్తరిస్తున్నది. సామాజిక అసమానతలపైనా, దురాచారాలపైనా సమరశంఖం పూరించిన ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి నాయకర్ జన్మించిన తమిళనాట సైతం అలాంటి అవాంఛనీయ ధోరణులు ప్రబలుతున్నాయని సుప్రసిద్ధ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ చేసిన ప్రకటన వెల్లడిస్తున్నది. నూటపాతికేళ్ల క్రితంనాడు ఉందంటున్న ఒక ఆచారం ప్రధానాంశంగా చేసుకుని ఆయన రాసిన ‘మధోరుభాగన్’ నవలపై హిందుత్వ సంస్థలు, కొన్ని కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేసి దాన్ని నిషేధించాలని, ఆ రచయితను అరెస్టు చేయాలని కొన్నాళ్లుగా ఆందోళన సాగిస్తున్నాయి. ఆయనపై పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. స్థానికంగా బంద్‌లు జరిగాయి. తన రచన ఈనాటి సమాజానికి సంబంధించినది కాదని... అందులో పేర్కొన్న ఆచారాలను, సంప్రదాయాలను ఇప్పటి ప్రమాణాలతో పోల్చిచూడటం తగదని పెరుమాళ్ చేసిన వినతి అరణ్యరోదనే అయింది. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ‘శాంతి సంఘం’ సమావేశంలో నవలలోని వివాదాస్పద భాగాలను తొలగించడానికి అంగీకరించిన తర్వాత ‘రచయిత పెరుమాళ్ మురుగన్ మరణించాడు. ఇకపై పి. మురుగన్ అనే సాధారణ టీచర్ మాత్రమే మిగులుతాడు’ అంటూ ఫేస్బుక్ మాధ్యమంద్వారా ఆయన ఉంచిన ప్రకటన అందరినీ కలవరపరిచింది. సృజనాత్మక రంగంనుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటున్నానని చెప్పడంతోపాటు తనను ఇకపై ఎలాంటి సాహితీ సమావేశాలకూ పిలవొద్దని, ఒంటరిగా విడిచిపెట్టాలని మురుగన్ విన్నవించుకున్నారు. నిరసనలకు, ఆందోళనలకు నాయకత్వంవహించినవారికి స్వప్రయోజనాలున్నాయని... తనను లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణాలున్నాయని మురుగన్ అంతక్రితం మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పిన అంశాలు అవాస్తవం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు వివాదానికి కారణమైన నవల తమిళ భాషలో అచ్చయి నాలుగేళ్లవుతున్నది. దాని ఇంగ్లిష్ అనువాదాన్ని పెంగ్విన్ ప్రచురణల సంస్థ నిరుడు వెలువరించింది. అది ప్రముఖ విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వస్తుందని కూడా పలువురు సాహితీవేత్తలు భావించారు. ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన కొంగునాడు ప్రాంతం సంగతి అటుంచి తమిళనాట ఎక్కడా ఇన్నేళ్లుగా దాన్ని నిషేధించాలని కోరినవారు లేరు. ఉన్నట్టుండి పుట్టుకొచ్చిన ఉద్యమం వెనక ఉద్దేశాలున్నాయని మురుగన్ అన్నది ఇందుకే. రచయితలైనా, కళాకారులైనా సమాజాన్ని విమర్శనాత్మకంగా ప్రతిబింబిస్తారు తప్ప లేనిది సృష్టించలేరు. ఏకదంత ప్రాకారంలో సృజన ప్రభవించదు. ఈ విషయాన్ని గ్రహించలేనివారే అనవసర ఆవేశాలకు పోయి రాతపైనో, గీతపైనో విరుచుకుపడతారు. కొన్నేళ్లక్రితం తన పెయింటింగ్‌లపై పెను వివాదం రేగినప్పుడు ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తీవ్రంగా కలతచెంది ఈ గడ్డపై మళ్లీ అడుగుపెట్టబోనని ప్రతినబూని వెళ్లిపోయారు. ఆయన మరో దేశంలో తనువు చాలించారు. బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్‌సింగ్ ‘జిన్నా:భారత్ విభజన, స్వాతంత్య్రం’ అనే గ్రంథం వెలువరించి మహ్మదాలీ జిన్నా పెట్టిన పాకిస్థాన్ డిమాండు రాజకీయపరమైనదని, అందులో ఉన్న మతస్పర్శ ఆయన ఉద్దేశించని పరిణామమని తేల్చిచెప్పారు. అప్పుడు కూడా పెద్ద వివాదం తలెత్తింది. ఆయనకు కనీసం షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా పార్టీనుంచి బహిష్కరించారు. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యేముందు మళ్లీ ఆ పార్టీలో చేరారు....అది వేరే విషయం. ‘మతముల న్నియు మాసిపోవును... జ్ఞానమొక్కటె నిలిచివెలుగును’ అన్నాడు మహాకవి గురజాడ. ఆయన రాసిన ‘కన్యాశుల్కం’ నాటకంలో సాంఘిక దురాచాలను పెంచిపోషిస్తున్నవారిపైనా, అలాంటివారి ఆచార వ్యవహారాలపైనా తీవ్ర విమర్శలున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే దాన్ని నిషేధించాలంటూ ఉద్యమం నడిచేదేమో! ‘కన్యాశుల్కం’ రచననాటికీ, ఇప్పటికీ పోల్చి చూసుకుంటే మనం ముందుకు నడిచామో, కొన్ని యుగాలు వెనక్కుపోయామో అర్థంగాని స్థితి. ఫ్రాన్స్‌లో ‘చార్లీ హెబ్డో’ పత్రికపై ఉగ్రవాదులు దాడికి తెగబడి కార్టూనిస్టులు, జర్నలిస్టుల ప్రాణాలు తీస్తే ఇక్కడ ఆ పని చేయకుండానే ఒక వ్యక్తి ‘రచయితగా నేను మరణించాన’ని చెప్పే స్థితికి తీసుకొచ్చారు. తమిళనాట ఇప్పుడు పరిపాలన సాగిస్తున్న అన్నా డీఎంకే, విపక్షంగా ఉన్న డీఎంకే... పెరియార్ రామస్వామి నాయకర్ ద్రవిడ ఉద్యమ నేపథ్యంలో ఉద్భవించినవి. ప్రస్తుత వివాదంలో ఆ పార్టీలు రెండూ తటస్థతను పాటించడంద్వారా పెరియార్ స్ఫూర్తికి తాము యోజనాల దూరంలో ఉన్నామని నిరూపించు కున్నాయి. ఫలితంగా ఒక రచయిత గొంతు నులమదల్చుకున్నవారిదే పైచేయి అయింది. ఇది విచారకరమైన విషయం.