Mother infant died
-
స్వైన్ ఫ్లూతో తల్లీబిడ్డ మృతి
-
స్వైన్ ఫ్లూతో తల్లీబిడ్డ మృతి
హైదరాబాద్: నగరంలో మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కుషాయిగూడలో స్వైన్ ఫ్లూ సోకి ఓ తల్లీబిడ్డ మృతిచెందారు. తల్లికి స్వైన్ ఫ్లూ ఉందని నిర్ధారించిన ఆస్పత్రి వైద్యులు ఆమెను బయటకు పంపేశారు. ఈ నేపథ్యంలో ఆ తల్లీబిడ్డ మృతిచెందినట్టు సమాచారం. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, కుషాయిగూడలో మరో వ్యక్తకి స్వైన్ ఫ్లూ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.