mother kills two sons
-
ఇద్దరు బిడ్డలను చంపిన తల్లి
సిద్దిపేట కమాన్: నవమాసాలు మోసి.. జన్మనిచ్చిన తల్లే తన బిడ్డల ప్రాణాలను బలితీసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మాతృమూర్తి తన కొడుకుల నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసా, కత్తితో పేగులు బయటకు వచ్చేలా కడుపులో పొడిచి అత్యంత పాశవికంగా అంతమొందించింది. అనంతరం కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. శనివారం సిద్దిపేట పట్టణంలోని గణేశ్‌నగర్‌లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల భాస్కర్, సరోజ ఆరున్నర సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో కొన్నాళ్ల పాటు వీరు కరీంనగర్లో ఉన్నారు. వీరికి ఆయాన్ (బిట్టు) (5), హర్షవర్ధన్(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్దికాలం తర్వాత ఈ దంపతులు సిద్దిపేట పట్టణానికి వచ్చి గణేశ్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. భాస్కర్ కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, భాస్కర్‌కు ఇది రెండో పెళ్లి. మొదటి భార్య, భాస్కర్‌పై రెండో పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టడంతో కొద్ది సంవత్సరాలు వాదోపవాదనలు జరిగిన అనంతరం ఈ మధ్య భాస్కర్‌కు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. భాస్కర్, సరోజకు ఇదే విషయంలో గత కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భాస్కర్ ఇంట్లో లేని సమయంలో శనివారం మధ్యాహ్నం సరోజ తన ఇద్దరు పిల్లలను బీరు సీసా, కత్తితో అత్యంత దారుణంగా కడుపులో పొడిచి చంపింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అదనపు డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్, వన్ టౌన్ సీఐ నందీశ్వర్‌రెడ్డి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిల్లల తండ్రి భాస్కర్ మృతదేహాలను చూసి భోరున విలపించాడు. కాగా, కొడుకులను చంపి సరోజ కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. ఈ ఘటనపై సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
కన్నతల్లి కర్కశత్వం.. నోట్లో గుడ్డలు కుక్కి..
సాక్షి, సిద్దిపేట : కన్నతల్లే తన ఇద్దరు పిల్లల్ని అతి కిరాతకంగా కడతేర్చింది. సొంత బిడ్డలన్న కనికరం లేకుండా నోట్లో గుడ్డలు కుక్కి.. బీరు సీసాతో దాడి చేసి హతమార్చింది. సిద్దిపేటలోని గణేశ్‌నగర్‌లో శనివారం మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. సిద్దిపేటలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్న సరోజ అనే మహిళ కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలు ఆర్యన్ (5), హర్షవర్ధన్ (రెండున్నరేళ్లు)లను అతి కిరాతంగా చంపింది. ఈ హత్యకు భార్యాభర్తల మధ్య గొడవలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం సరోజ కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. పిల్లల మృతదేహాలను చూసి తండ్రి రోదించడం.. స్థానికులను కంటతడి పెట్టించింది. ఇక సరోజను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఎంత పని చేశావు తల్లీ !
కోల్‌సిటీ (రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మహాశివరాత్రి పండుగ పూట దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి.. పేగు తెంచుకుని పుట్టిన తన ఇద్దరు కొడుకుల తలపై ఇటుకతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరు మృతి చెందారు. పిల్లలిద్దరూ తనతో ప్రేమగా, చనువుగా ఉండటం తట్టుకోలేక తన భార్య వారిపై దాడి చేసిందని తండ్రి ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేనరికం.. ఉన్నత విద్యావంతులు.. గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన బద్రి శ్రీకాంత్, రమాదేవి దంపతులు. ఇందులో రమాదేవి తండ్రి.. శ్రీకాంత్ తల్లి అన్నాచెల్లెళ్లు కావడంతో మేనరికం కుదరగా 2003 నవంబర్ 4న ఇరువురికి పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అజయ్(10), ఆర్యన్(6) ఉన్నారు. శ్రీకాంత్ స్థానికంగానే ప్రభుత్వ మైనార్టీ గురుకులంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, రమాదేవి కొంతకాలం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేసి ప్రసుతం ఇంటి వద్దే ఉంటోంది. వీరి పిల్లలు అజయ్ 4వ తరగతి, ఆర్యన్ ఎల్కేజీ చదువుతున్నారు. దంపతుల మధ్య గొడవలు.. కొంతకాలంగా శ్రీకాంత్, రమాదేవిల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు తండ్రి శ్రీకాంత్‌తో చనువుగా ఉంటున్నారని తరచూ చెప్పుకునే రమాదేవి.. కొడుకులను అదే కారణంతో కొట్టేదని చెబుతున్నారు. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైనార్టీ గురుకులంలో పని చేస్తున్న శ్రీకాంత్ ఆదివారం రాత్రి విద్యార్థులకు పాఠాలు బోధించి అక్కడే పడుకున్నాడు. సోమవారం ఉదయం నిర్మాణంలో ఉన్న తన తండ్రి ఇంటిని పరిశీలించి అక్కడి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో భార్య రమాదేవికి ఫోన్ చేశాడు. శివరాత్రి పూజ కోసం పండ్లు, సామాగ్రి తీసుకురావాలా అని అడిగి ఆమె సూచన మేరకు పూజా సామాగ్రితోపాటు పిల్లలకు తినడానికి అల్పాహారం కూడా తీసుకొని ఇంటికొచ్చాడు. గట్టిగా కొట్టడంతో.. శ్రీకాంత్ ఇంటికి రాకముందే రమాదేవి ఇద్దరు కొడుకుల తలపై ఇటుకతో విచక్షణా రహితంగా దాడి చేయగా తలలు పగిలిపోవడంతో కొడుకులిద్దరూ కుప్పకూలారు. ఇంటికి చేరుకున్న శ్రీకాంత్ పిల్లలను పిలిస్తే సమాధానం రాకపోగా, గేటుకు లోపలివైపు గడియపెట్టి తాళం వేసి ఉండడంతో అనుమానిం చాడు. స్థానికులను పిలిచి గోడ దూకి ఇంటి ఆవరణలోకి శ్రీకాంత్ వెళ్లే సరికి పిల్లలిద్దరూ తలలు పగిలి రక్తపు మడుగులో మూలుగు తూ కనిపించారు. పక్కనే రక్తంతో తడిసి పగిలిన ఇటుక కనిపించింది. భార్య చేతికి రక్తం మరకలు ఉన్నాయి. దీంతో స్థానికులు తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలను గోదావరిఖలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి తీవ్రంగా గాయపడిన పెద్ద కుమారుడు అజయ్ చికిత్స పొందుతూ గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. చిన్న కుమారుడు ఆర్యన్‌కు కూడా తలకు బలమైన గాయాలు కావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ సంఘటన స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్ పరిశీలించారు. మృతుల తండ్రి శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
పిల్లలిద్దరినీ ఓవెన్లో కుక్కి...
సాక్షి, న్యూయార్క్ : అమెరికాలో గత వారం ఓ తల్లి అత్యంత క్రూరమైన ఘటనకు పాల్పడింది. తన ఇద్దరు పిల్లను ఓవెన్లో పెట్టి హింసించి మరీ చంపింది. ఆ తల్లి అంతటితో ఆగలేదు. ఆ తతంగం అంతా వీడియో తీసి తన భర్తకు పంపింది. అయితే అతను అప్రమత్తం అయ్యే లోపే ఘోరం జరిగిపోయింది. అట్లాంటాకు చెందిన లమోరా విలియమ్స్ భర్తతో వీడియో ఛాట్ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ మహిళ.. తన రెండేళ్ల కుమారుడు యుంటే పెన్, ఏడాది చిన్నారి కార్టర్ విలియమ్స్‌లను ఒవెన్‌లో కూర్చోపెట్టింది. అయితే తన పిల్లలను ఏదో ప్రమాదం జరగబోతుందని ఊహించిన తండ్రి జమీల్ పెన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి వచ్చే లోపే పిల్లలు మాంసం ముద్దలుగా మారిపోయారు. కాగా, ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు ఇరుగుపొరుగు వారు తెలిపారు. అయినప్పటికీ లమోరాపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కన్న కొడుకులను బావిలో పడేసిన తల్లి
నిజామాబాద్: కుటుంబ కలహాలతో కన్నతల్లే తన ఇద్దరు కొడుకులను బావిలో పడేసింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా మాట్లూరు మండలం వెనుకీసాన్‌నగర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెనుకీసాన్‌నగర్ గ్రామానికి చెందిన వెంకట్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు చరణ్(3), వరుణ్(2). వెంకట్ దుబాయిలో పని చేసేవాడు. కాగా నెల రోజుల క్రితమే దుబాయి నుంచి ఇంటికి వచ్చాడు. అతను వచ్చినప్పటి నుంచి కుటుంబంలో తరచు కలహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే భార్య తన ఇద్దరు కొడుకులను తీసుకెళ్లి తమ వ్యవసాయ బావిలో పడేసింది. నీటిలో మునిగి పిల్లలిద్దరూ మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పిల్లల మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.