Mothers Body
-
హృదయవిదారక ఘటన ..తల్లి శవాన్ని భుజాలపై మోస్తూ..
పశ్చిమ బెంగాల్లో జల్‌పాయ్‌గురిజిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్‌కి సరిపడా డబ్బులు లేకపోవడంతో తండ్రి కొడుకలిద్దరు మహిళ మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లారు. ఈ ఘటన చూపురులను కంటితడి పెట్టించింది. వివరాల్లోకెళ్తే..రామ్ ప్రసాద్ దేవాన్ అనే వ్యక్తి 72 ఏళ్ల తల్లికి శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతోంది. దీంతో ఆమెను జల్పాయ్గుడి మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి బుధవారం తీసుకువెళ్లారు. ఐతే ఆమె గురవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచింది. ఐతే ఆస్పత్రి వద్ద ఉన్న అంబులెన్స్ మాములుగా సుమారు రూ. 900లు వసూలు చేస్తోందని, కానీ సదరు అంబులెన్స్ ఆపరేటర్ మాత్రం దాదాపు రూ. 3000 డిమాండ్ చేసినట్లు తెలిపాడు. దీంతో తాను అంత మొత్తం చెల్లించలేక ఇలా భుజాలపై మోసుకెళ్తున్నట్లు దేవాన్ వెల్లడించాడు. వారు ఆమెను ఒక బెడ్‌షీట్‌లో చుట్టి తండ్రి కొడుకులిద్దరూ..40 కిలోమీటర్లు దూరంలో ఉన్న తమ ఇంటికి భుజాలపై తీసుకువెళ్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కళ్యాణ్ ఖాన్ స్పందించి... ఇది చాలా బాధకరమైన ఘటన అని అన్నారు. తాము ఈ విషయంలో తాము క్రమం తప్పకుండా ప్రజలకు తగిని ఏర్పాట్ల చేస్తామని, కానీ వారు మమ్మల్ని సంప్రదించలేదని అన్నారు. బహుశా వారికీ తెలియకపోవచ్చు, ఈ విషయం అందరికీ తెలిసేలా చేయాలన్నారు. ఐతే కొంతసమయానికి దేవాన్‌కి ఒక స్వచ్ఛంద సామాజిక సంస్థ వాహనాన్ని అందించిందని, క్రాంతిబ్లాక్‌లోని తన ఇంటికి ఉచితంగా తీసుకువెళ్లినట్లు సమాచారం. ఐతే స్వచ్ఛంద సామాజిక సంస్థ అదికారులు మాత్రం ఉచిత సేవలు అందించే వారిని అంబులెన్స్ ఆపరేటర్లు ఆస్పత్రి వద్దకు రానివ్వరని అన్నారు. ఇదిలా ఉండగా, జిల్లా అంబులెన్స్ అసోసియేషన్ తమ సభ్యులు రైలు, రోడ్డు ప్రమాదాలకు ఉచితంగానే అంబులెన్స్ సేవలు అందిస్తున్నామని నొక్కి చెప్పడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. The Son of Bengal is carrying the dead body of Bengal's health system! Which Bengal is this ?@narendramodi @AmitShah @amitmalviya @sunilbansalbjp @mangalpandeybjp @RajuBistaBJP @SuvenduWB @SwarnaliM @Priyankabjym @Amrita_06_11 @BJP4Bengal @Amitava_BJP @ pic.twitter.com/Vafb5hGFfp — Dr. Shankar Ghosh (@ShankarGhoshBJP) January 5, 2023 (చదవండి: విమానంలో మూత్ర విసర్జన: వివాదం సెటిల్ అవ్వడంతో ఫిర్యాదు చేయలేదు) -
పెన్షన్ కోసం తల్లి శవాన్ని..
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ : డబ్బుకు లోకం దాసోహం. ఇది ఊరికే చెప్పలేదు. ఎందుకంటే డబ్బే ప్రధానం అన్నింటికి. అన్ని బంధాలను నిలిపేది, పడగొట్టేది ఈ డబ్బే. దీనికి తార్కాణంగా నిలిచే ఘటన ఒకటి కోల్‌కతాలో చోటుచేసుకుంది. తల్లికి వచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఆమె మరణాన్ని కూడా లోకానికి తెలియకుండా చేశాడు. తల్లి శవాన్ని ఇంట్లోని ఫ్రిజ్లోనే దాచిపెట్టారు. ఆమె కొడుకు, భర్త కలిసి ఈ పని చేశారు. తల్లికి వచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఆమె బతికే ఉన్నట్లుగా సర్టిఫికేట్స్ కూడా సృష్టించాడు. వివరాలు...కోల్‌కతాకు చెందిన బీనా మజుందార్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తు ఉండేది. అనారోగ్యం కారణంగా 2015 ఏప్రిల్ 7న హాస్పిటల్లో మరణించింది. అయితే అప్పటి నుంచి తన భర్త గోపాల్ మజుందార్, కుమారుడు సుప్రభాత్ మజుందార్లు ఆమె శవాన్ని ఇంట్లోనే ఫ్రిజ్‌లో దాచిపెట్టారు. ఇరుగు పొరుగు వారు అడిగితే మార్చురీలో ఉందని చెప్పేవారు. బీనా మజుందార్‌కు వచ్చే పెన్షన్ డబ్బులను గత రెండేళ్ల నుంచి వీరే డ్రా చేస్తున్నారు. అయితే పెన్షన్ కోసమే ఇలా చేసుండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. శవంపై కత్తి గాట్లు ఉన్నాయని, పోస్ట్‌మార్టంకు తరలించామని దాని తర్వాతే అసలు నిజాలు చెప్పగలమని పోలీసులు పేర్కొన్నారు. -
తల్లి శవం పక్కనే 20 గంటలు...
చెన్నై: భారీ వర్షాలతో చెన్నై వాసులు కనీవినీ ఎరుగని రీతిలో కష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకడం లేదు. కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా చోటులేకపోవడంతో ప్రజలు బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. అశోక్ నగర్ ప్రాంతంలో ఓ మహిళ తన తల్లి శవం పక్కనే కూర్చుని దాదాపు 20 గంటలుగా జాగారం చేస్తోంది. తనకు సహాయం చేయాలని సదరు మహిళ స్నేహితులను కోరడం, వారు మీడియాను అభ్యర్థించడంతో ఈ విషయం వెలుగుచూసింది. 'మా అమ్మ డయాలిసిస్ పేషెంట్. నిన్ననే ఆమె చనిపోయింది. కరెంట్ లేకపోవడంతో భౌతికకాయం చీకటిలోనే ఉంది. శవాన్ని శ్మశానానికి తరలించేందుకు దయచేసి ఎవరైనా వాహనం పంపించండి. ఇప్పటికే భౌతికకాయం పాడైపోయ్యే స్థితిలో ఉంది. నాకు సహాయం చేయండి' అని ఆమె వేడుకుంది. దీంతో కరిగిపోయిన ఆమె స్నేహితులు మీడియాకు సమాచారం అందించారు. కాగా, వరదలు పోటెత్తడంతో చెన్నైకు సంబంధాలు తెగిపోయాయి. సహాయక కార్యక్రమాలు చురుగ్గా సాగడం లేదు. సైన్యం, నావికా దళం, వాయుసేన తదితర బలగాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.