మోటో కొత్త ఫోన్లు లీక్.. ఫీచర్లివేనట!
లెనోవో మిడ్ రేంజ్లో తీసుకొస్తున్న మోటో జీ5, జీ5 ప్లస్ స్మార్ట్ఫోన్లు లాంచింగ్‌కు ముందే లీకైపోయాయి. ఫిబ్రవరి 26న బార్సిలోనాలో జరుగబోయే ఎండబ్ల్యూసీ 2017 ఈవెంట్లో వీటిని కంపెనీ అధికారికంగా లాంచ్ చేసేందుకు రంగం చేసుకుంది. కానీ అధికారికంగా లాంచింగ్‌కు ముందే వీటిని స్పానిస్ ఆన్ లైన్ రిటైలర్ తన సైట్ లో లిస్టుచేసేసింది. స్పెషిఫికేషన్స్, ఫీచర్లు, ఇతర వివరాలన్నింటిన్నీ ఈ రిటైలర్ లిస్టు చేసింది.
మోటో జీ5, జీ5 ప్లస్ డిజైన్...
మార్కెట్లోకి ఇక ఎంట్రీ ఇవ్వబోతున్న మోటో జీ5, జీ5 ప్లస్‌లు స్పోర్ట్ మెటల్ బాడీస్‌తో రాబోతున్నాయట. సైడ్ ప్యానెల్స్ విషయంలో లెనోవో బ్రాండింగ్ లో ఈ ఫోన్ మన ముందుకు వస్తోందని తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్రంట్ ప్యానెల్ లో ఉండబోతుందట. ప్రైమరీ కెమెరా వెనుకవైపు సర్క్యూలర్ డిజైన్ లో ఉంటుంది. మోటో ''ఎం'' లోగో కూడా వెనుకవైపే ఉంది.
మోటో జీ5 స్పెషిఫికేషన్స్...
5 అంగుళాల ఫుడ్-హెచ్డీ డిస్ ప్లే, 32జీబీ బోర్డు స్టోరేజ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 1.4గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 ఎస్ఓసీ, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్టును కలిగి ఉంటుంది.
మోటో జీ5 ప్లస్ స్పెషిఫికేషన్స్...
5.2 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ ప్లే, 64జీబీ స్టోరేజ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 ఎంపీ కెమెరా విత్ డ్యూయల్ ఆటోఫోకస్ ఫీచర్, 2 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ, 4జీ ఎల్టీఈ, 155 గ్రాముల బరువు ఇవీ మోటో జీ5 ప్లస్ ప్రత్యేకతలు.
రెండు ఫోన్లకు ఉండబోయే సిమిలర్ ఫీచర్స్..
ఫుల్-హెచ్డీ స్క్రీన్ రెజుల్యూషన్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కవర్
ఆండ్రాయిడ్ 7.0 నోగట్
128జీబీ వరకు ఎక్స్ పాండబుల్ మెమరీ
2జీబీ ర్యామ్
5ఎంపీ ఫ్రంట్ కెమెరా
వాటర్ రిపేలెంట్ కోటింగ్